Post Office New Schemes: పోస్టల్ శాఖ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా పోస్టాఫీస్(Post Office) కొత్తకొత్త స్కీమ్స్ (New Schemes)ను కూడా ప్రజల కోసం అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టల్ శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పేరుతో పోస్టాఫీస్ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలుగా ఉంది. 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కనీసం ఈ స్కీమ్ లో జమ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ అమలవుతుందని సమాచారం.
వార్షిక ప్రాతిపదికన ఈ స్కీమ్ అమలవుతుండగా మెచ్యూరిటీపై వడ్డీని చెల్లించడం జరుగుతుంది. కనీసం లక్ష రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 80సి కింద ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఖాతాదారులు రిటర్న్ లో ఎక్కువమొత్తం వడ్డీ పొందే అవకాశాలు ఉంటాయి. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీపై వడ్డీ ఆదాయంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. 1,000 రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత వడ్డీ ఆదాయం 389.49 రూపాయలుగా ఉంది. లక్ష పెట్టుబడికి వడ్డీగా 38,949 రూపాయలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.