Tollywood Producer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోగలిగిన స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంటుందంటూ కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజానికైతే ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ భారీగా లాభపడతాడు. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ భారీ మొత్తం లో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు…ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వచ్చిన పులి (Puli) సినిమా అలాగే మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ఖలేజా సినిమా రెండు కూడా డిజాస్టర్లుగా మారాయి….ఇక ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూసర్ ఒకరే అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆయన ఎవరు అంటే సింగనమల రమేష్ బాబు (Ramesh Babu)అనే ప్రొడ్యూసర్ కావడం విశేషం…
ప్రస్తుతం రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో ప్రొడ్యూసర్ రమేష్ బాబు మాట్లాడుతూ పవర్ స్టార్, సూపర్ స్టార్లతో చేసిన రెండు సినిమాలు నన్ను తీవ్రంగా నష్టానికి గురి చేశాయి. అయితే ఈ సినిమాలు సంవత్సరాల కొద్ది సెట్స్ మీదనే ఉండటం వల్ల దాదాపు 100 కోట్ల వరకు నాకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పాడు.
ఒకప్పుడు సినిమా స్టార్ట్ అయితే ఆరు నెలల లోపు సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసేవారు. కానీ దురదృష్టవశాత్తు నా రెండు సినిమాలకే దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధి తీసుకోవడం వల్ల తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. వాటికి వడ్డీలు కడుతూ చాలావరకు నష్టపోయాను ఇక సినిమాలు కూడా డిజాస్టర్ల బాట పట్టడంతో నేను చేసేది ఏమీ లేకుండా పోయింది అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పటివరకు నాకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేదు. పైగా నేను ఫోన్లు చేస్తే కూడా కనీసం ఎవరు ఎత్తలేదు అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న సూపర్ స్టార్, పవర్ స్టార్లు ఈ విషయం మీద వాళ్ల ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…