silver used in cars: బంగారం, వెండి ధరలు పెరుగుతూ తగ్గుతున్నాయి. మొన్నటి వరకు బంగారం ధర లక్షల్లో ఉండడంతో.. చాలామంది వెండిని కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవల వరుసగా ధరలు తగ్గుతుండడంతో ఇప్పటివరకు వెండిపై ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది వెండినీ కేవలం ఆభరణాలకు మాత్రమే వాడుతారని అనుకుంటారు. వాస్తవానికి ఇతర రంగాల్లో కూడా వెండి అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా కార్ల వినియోగంలో వెండిని చాలా వరకు ఉపయోగిస్తుంటారు. పైకి మనకు ఇది ఎక్కడ కనిపించకపోయినా కొన్ని పార్ట్స్ లో వెండి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఎలాంటి విభాగాల్లో వెండి అవసరం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కార్ల వినియోగం పెరిగిపోతుంది. పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు కాలుష్య నివారణకు EV లా కొనుగోలుపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే విద్యుత్ కార్లలో వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కాంటాక్ట్స్, వైరింగ్, స్విచ్ లలో వెండి వాడుతారు. దీనిని వాడడం వల్ల విద్యుత్ కు తక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆధునిక కార్లలో ఇంజన్ కంట్రోల్ యూనిట్స్, సెన్సార్ల విభాగం చాలా ముఖ్యమైనది. ఇందులో ఇంధన వినియోగం, ఎమిషన్స్, ఇంద్ర పనితీరు అన్ని దీని ఆధారంగానే పనిచేస్తాయి. ఇందులో ఉండే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లో వెండి పేస్ట్, వెండి కాంటాక్ట్స్ వాడతారు. అలాగే ఆక్సిజన్ సెన్సార్లు, టెంపరేచర్ సెన్సార్లలో కూడా వెండి ఉపయోగముంటుంది.
ప్రతి కారులో సేఫ్టీ ఫీచర్స్ తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఎలక్ట్రిక్ కార్లలో ఎయిర్ బ్యాగ్స్, ABS టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎయిర్ బ్యాగ్స్ సిస్టంలో వేగంగా విద్యుత్ ప్రవాహం జరగాలి. ఇందుకోసం వెండిని ఉపయోగిస్తారు. చిన్న ఆలస్యం కాకుండా ప్రమాదకరంగా మారే సందర్భాల్లో కూడా వెండి విశ్వనీయత ఎంతో ముఖ్యం. ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిస్ప్లే లో , చార్జింగ్ కంట్రోలర్, పవర్ ఇన్వర్టర్ వంటి వాటిలో పెట్రోల్ కార్లు కంటే ఈవీ కారులో వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో కనెక్టెడ్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం వంటి కార్లు రాబోతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని కొంతమంది వెండిని ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.
ఈ విధంగా కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా కార్లలోను వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే వెండి కి ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా ధరలు పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుండగా.. కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.