Honor 500 Pro: మొబైల్ రంగంలో బలమైన డివైస్ గా Honor కంపెనీకి చెందినవి చెప్పుకుంటారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2025 నవంబర్ చివరిలో చైనాలో ప్రవేశపెట్టిన హానర్ గురించి ఇప్పుడు ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇందులో శక్తివంతమైన హార్డ్వేర్ తో పాటు.. డిజైన్, డిస్ప్లేలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీన్ని చూడగానే వెంటనే కొనేయాలనిపించేలా ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అద్భుతమైన కెమెరాను అందించే ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Honor కంపెనీ నుంచి లేటెస్ట్గా 500 ప్రో 5G లాంచ్ అయింది. ఈ మొబైల్లో స్టైలిష్ డిజైన్తో కలిగి ఉంది. 7.8 ఎంఎం సన్నని బాడీతో ఉన్న వంపులు తిరిగిన అంచులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మొబైల్ బరువు 201 గ్రాములు. దీంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇందులో పంపు తిరిగిన AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు కావాల్సిన వీడియోలను చూసేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే గేమింగ్ కోరుకునే వారికి కూడా ఆకర్షణగా ఉండనుంది. ఇందులో HDR మద్దతుతో వీడియోలు చూడడంతో కాంట్రాస్ట్ ను పెంచుతుంది. అలాగే పిడబ్ల్యూఎం వంటి కంటిరక్షణ చర్యలు కూడా ఉంటాయి.
ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావడంతో ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. అలాగే తక్కువ సమయంలోనే తొందరగా చార్జింగ్ కావడానికి సౌకర్యంగా ఉంటుంది. డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో రోజువారి వినియోగదారులకు సపోర్టు ఇస్తుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ చేసుకోవడానికి ఇందులో ఉండే బ్యాటరీ పనిచేయనుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది కెమెరా గురించి ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. ఈ కొత్త హానర్ మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది తక్కువ కాంతిలో కూడా కావలసిన ఫోటోలను అందిస్తుంది. అలాగే టెలిఫోటో లెన్స్ ఆప్టికల్ జూమ్ తో ఫోటోలు ఎలా కావాలనుకుంటే అలా తీసుకునే విధంగా కెమెరాను సెట్ చేశారు. అల్ట్రా వైడ్ కెమెరా కూడా అనుగుణంగా ఉండడంతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకోవచ్చు. ఫోర్ కె వీడియోకు కూడా అనుమతి ఉండడంతో నాణ్యమైన వీడియోలను తీసుకోవచ్చు. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండడంతో దీని పనితీరు మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. మల్టీ టాస్కింగ్ తో పాటు హెవీ గేమింగ్ ఆడుకునే వారికి ఇది ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి కూడా ఫాస్టెస్ట్ గా మూవ్ అవుతుంది. ఇక ఇందులో 16 జిబి రామ్ ఉండడంతో మరింత స్పీడ్ గా వర్క్ చేసుకోవచ్చు. దీనిని మార్కెట్లో రూ.12,990 తో విక్రయిస్తున్నారు.