Honda Amaze
Honda Amaze :కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే, అద్భుతమైన ఫీచర్లతో పాటు మంచి మైలేజీని కూడా అందించే హోండా అమేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లకు పోటీగా విడుదలైన ఈ కారు సెడాన్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ కారు ధర, మైలేజ్,సేఫ్టీ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. అమ్మకాల్లో విండ్సర్ రికార్డు
పవర్ ఫుల్ ఇంజన్
హోండా అమేజ్ లో 1199cc, 1.2-లీటర్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 89bhp పవర్, 110Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ , CVT ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఈ కారు లీటరు పెట్రోల్‌కు 19.46 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ప్రస్తుతం డీజిల్ ఎంపికలో అందుబాటులో లేదు.
హోండా అమేజ్ మైలేజ్
హోండా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మైలేజ్‌కు సంబంధించిన సమాచారం ఉంది. కంపెనీ ప్రకారం, ఈ సెడాన్ లీటరు పెట్రోల్‌కు 19.46 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. డ్రైవింగ్ స్టైల్, మెయింటెనెన్స్ వంటి అనేక అంశాలపై మైలేజ్ ఆధారపడి ఉంటుందని గమనించాలి.
సేఫ్టీ ఫీచర్స్
హోండా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..ఈ కారులో హోండా సెన్సింగ్ ADAS ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, 3 పాయింట్స్ ELR సేఫ్టీ సీట్ బెల్ట్‌లు వంటి 28కి పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
హోండా అమేజ్ ధర
416 లీటర్ల బూట్ స్పేస్‌తో లభించే ఈ సెడాన్ ధర 8 లక్షల 09 వేల 900 రూపాయల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది బేస్ వేరియంట్ ధర. ఈ కారు టాప్ వేరియంట్ కొనాలంటే 11 లక్షల 19 వేల 900 రూపాయలు (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. హోండా అమేజ్ హ్యుందాయ్ ఆరా, టాటా మోటార్స్ టిగోర్, మారుతి సుజుకి డిజైర్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.
Also Read : ఫ్రాంక్స్, పంచ్‌లను కూడా దాటి హ్యుందాయ్ క్రెటా రికార్డ్ !
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Honda amaze honda amaze is the best car for a family under rs 8 lakhs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com