Honda Activa E: ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ Honda ఇప్పటికే వినియోగదారులకు అనుకూలమైన వాహనాలను అందించింది. అయితే ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని అనుకుంటున్నారు. వారికి అనుగుణంగా EV బైకులను తీసుకురావాలని చూస్తోంది. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా 420 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కొత్త వెహికల్ ను ఆవిష్కరించింది. అలాగే నిమిషాల్లోనే తొందరగా చార్జింగ్ పూర్తయ్యే విధంగా బ్యాటరీని అమర్చింది. నగరాలతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి ఈ వాహనం ఎంతో అనుగుణంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
2026 కొత్త సంవత్సరం సందర్భంగా మార్కెట్లోకి రాబోతున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బైక్ గురించి ఆన్లైన్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఇప్పటికే హోండా కంపెనీకి చెందిన యాక్టివా ఎలక్ట్రిక్ బైక్ ను చాలామంది ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు కొత్తగా దీని డిజైన్ తీరును మార్చారు. కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ తో జోడించి.. నేటి వారికి అనుగుణంగా ఉండేందుకు తీర్చిదిద్దారు. ఈ కొత్త బైక్ ప్యానెల్ మృదువుగా ఉండనుంది. ముందటి భాగంలో పాత మోడల్స్ తో పోలిస్తే గీతలతో బోల్డ్ బైకులా తలపిస్తుంది. అలాగే స్పోర్ట్స్ బైక్ లాగా లుక్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్లు ప్రీమియం లుక్ ను తీసుకొచ్చాయి. ప్రయాణం చేయడానికి మాత్రమే కాకుండా వస్తువులను తీసుకెళ్లడానికి అనువైన స్థలం ఉండే విధంగా డిజైన్ చేశారు. రాత్రిపూట ప్రయాణం చేసే వారికి స్టైల్ లైట్స్ సౌకర్యాన్ని ఇవ్వరున్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సెక్యూర్ లాకింగ్ సిస్టం ఉండడంతో భద్రత ఎక్కువయ్యా అని చెప్పవచ్చు.
ఈ బైక్ లో శక్తివంతమైన మోటార్ ను అమర్చారు. ఇందులో భాగంగా ఇందులో అమర్చబడిన బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 420 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లను అమర్చారు. 5 అంగుళాల LCD డిస్ప్లేను అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ తోపాటు నావిగేషన్ అసిస్ట్ ఉండనున్నాయి. అలాగే యూఎస్బీ పోర్టు, టైప్ సి చార్జింగ్ కు అనుకూలంగా పోర్టును సెట్ చేశారు.
ఈ బైక్ పై ఫ్రంట్ డిస్క్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం ఉండడంతో ప్రయాణికులకు రక్షణ ఉండే అవకాశం ఉంది. సస్పెన్షన్ రోడ్డు తో పాటు.. గతుకుల రోడ్లపై కూడా సులభంగా వెళ్లే విధంగా దీనిపై డ్రైవింగ్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఎంత దూరం ప్రయాణించిన ఎలాంటి అలసట ఉండదు. ఈ బైక్ మార్కెట్లోకి వస్తే అనుకూలమైన ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే రూ. 1.18 లక్షల నుంచి రూ.1.59 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.