Raja Saab First Day Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మొదటి రోజు వరకు ఓపెనింగ్ వసూళ్లు డీసెంట్ గానే వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ ప్రభావం నూన్ మరియు మ్యాట్నీ షోస్ మీద బలంగా పడ్డాయి కానీ, ఫస్ట్ షోస్ నుండి బాగా పికప్ అయ్యాయి. ఫలితంగా ఓవరాల్ మొదటి రోజు వసూళ్లు చాలా డీసెంట్ గా వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి , అసలు ఈ ప్రాంతం లో రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్స్ షోస్ కి కానీ, రెగ్యులర్ షోస్ కి కానీ మొదలు పెట్టలేదు. చాలా ఆలస్యంగా విడుదల రోజు తెల్లవారు జామున అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు.
అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి మొదటి రోజు నైజాం ప్రాంతం నుండి 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 4 కోట్ల 75 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 2 కోట్ల 62 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజున 5 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక్కడ యావరేజ్ రేంజ్ వసూళ్లు అనే చెప్పాలి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా లో ఈ చిత్రానికి కేవలం కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ప్రీమియర్స్ నుండి 80 లక్షల రూపాయిల వచ్చాయట. అదే విధంగా హైర్స్ కలుపుకొని ఈ చిత్రానికి దాదాపుగా 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా లో ఈ సినిమాకు 2 కోట్ల 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, నెల్లూరు నుండి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ కాకుండా 39 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి కానీ, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి రోజున 42 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో చాలా తక్కువ షేర్ వసూళ్లు వచ్చాయని రామ్ చరణ్ అభిమానులు చాలా బాధపడ్డారు కానీ, ‘రాజా సాబ్’ ఓపెనింగ్ చూసిన తర్వాత పర్వాలేదు , బాగానే వచ్చాయని అనుకుంటున్నారు.