Hindenburg Research: హిండెన్‌బర్గ్‌ మరో సంచలనం.. స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ మరో సంచలనానికి తెరతీసింది. సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పూరి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు కృత్రిమంగా పెంచేందుకు యత్నించిందని పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : August 11, 2024 11:58 am

Hindenburg Research

Follow us on

Hindenburg Research: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ సరిగ్గా ఏడాది క్రితం అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక పెను దుమారం సృష్టించింది. ఈ నివేదికతో అదాని కంపెనీ షేర్లు అధఃపాతాళానికి పడిపోయాయి. 86 బిలియన్‌ డాలర్లను ఆ ఒక్క నివేదిక తుడిచిపెట్టింది. పార్లమెంటులో దుమారం రేపాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించడం.. ఇటీవలే నివేదిక ఇవ్వడంతో ఇపుపడిప్పుడే అదానీ షేర్లు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. 2023 జనవరి 23న అదానీ గ్రూప్‌పై ఘాటైన నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్‌ మరో సంచలనానికి తెరతీసింది. ఈసారి అదానీ గ్రూప్‌కు సంబంధించి సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పూరి బచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఎక్స్‌లో తాజాగా చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. ‘ ౌఝ్ఛ్టజిజీnజ bజీజ టౌౌn ఐnఛీజ్చీ‘ అక్షరాల దీన్నే హిండెన్‌బర్గ్‌ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీన్ని చూసే స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని మదుపర్లు టెన్షన్‌ పడుతున్నారు. చెప్పినట్లే చేసింది.

అదానీ సంస్థల షేర్ల విలువ పెంపు..
సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పూచి బజ్‌ అదాని గ్రూప్‌కు చెందిన విదేశీ షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ చైర్‌పర్సన్‌కు, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానికి చెందిన మారిషస్, అఫ్‌షోర్‌ షెల్‌ సంస్థల సంస్థల వివరాలు తెలుసుకోవడానికి సెబీ ఆసక్తి చూపకపోవడం తనను ఆశ్చర్య పరిచిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడాన్ని గమనించామని తెలిపింది. సెబీ చైర్‌పర్సన్‌ మాధబితో అదానీ సంస్థల జోక్యాన్ని వివరించడం ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. విజియల్‌ బ్లోయర్‌ పత్రాల ప్రకారం.. గౌతమ్‌ అదాని సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయని తెలిపింది. ఇందులో మాదభి పూరి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని పేర్కొంది. ఈ దంపతుల వాటా విలువ 10 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.83 కోట్లు) ఉంటుందని తెలిపింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సెబీ ఇంకా స్పందించలేదు.

గతేడాది నివేదిక ఇదీ..
2023 జనవరి 24 హిండెన్‌ బర్గ్‌ అదానీ గ్రూప్‌ సంస్థల గురించి సంచలన నివేదిక బయటపెట్టింది. అదానీ సంస్థల్లో షేర్ల ధరల్లో అవకతవకలు, ఆర్థికలావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ చేసింది. ఫలితంగా ఆయన తన నికర మార్కెట్‌ విలువలో ఏకంగా 86 బిలియన్‌ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, నాటి క్లిష్ఠ పరిస్థితుల నుంచి క్రమంగా కోలుకుంటున్న అదానీ మళ్లీ తన పరుగు ప్రారంభించారు.

పురోగమిస్తున్న వేళ కలకలం..
అయితే కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై సెబీ ఏం చెబుతుంది.. సోమవారం మార్కెట్లు ఎలా ఉంటాయి అన్న భయాలు నెలకొన్నాయి. స్టాక్‌ మార్కెట్లు కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న వేళ.. హిండెన్‌బర్గ్‌ కుట్రకోణంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో నివేదికలు విడుదల చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.