మారుతి eVXపై బిగ్ అప్డేట్..
మారుతి సుజుకీ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎన్నోమోడళ్లు ఆకర్షించాయి. అయితే లేటేస్టుగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోరుకుంటున్న తరుణంలో ఈ కంపెనీ సైతం ఈవీలను తీసుకురావాలని ఇప్పటికే తహతహలాడింది. ఇందులో భాగంగా మారుతి eVX ను ఇప్పటికే పరిచయం చేసింది. అయితే ఈ మోడల్ గురించి చాలా మందిలో అనేక డౌట్స్ ఉన్నాయి. ఇటీవల ఆన్ లైన్ లో కారుకు సంబంధించిన చిత్రాలు, ఫీచర్ల గురించి వివరాలు వెల్లడించారు. అవెలా ఉన్నాయంటే?
ఇప్పటి వరకు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లల్లో కంటే మారుతి సుజుకీ eVX పూర్తిగా విభిన్నంగా ఉంది. ఇంటీరియర్ నుంచి ఎక్సీటీరియర్ వరకు అన్నీ లేటేస్టుగా ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికొస్తే కొత్త టూ స్పోక్ మంల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్రైవ్ మోడ్ ల కోసం రోటరీ యల్, ఫ్రీ స్టాండింగ్ వంటివి ఆకర్షిస్తాయి. అలాగే టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ యూనిట్, డోర్ హ్యాండిల్స్ క్రోమ్, ఆటో డిమ్మింగ్ లను కూడా ఇందులో చూడొచ్చు.
ఎక్స్ టీరియర్ విషయానికొస్తే కొత్త ఫ్రంట్, రియర్ బంపర్లు ఆకర్షిస్తాయి. అల్లాయ్ వీల్స్, సి ఫిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ తో పాటు ఈవీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులను అమర్చారు. అయితే మారుతి సుజుకీ eVX ఇంజిన్ గురించి వివరాలు వెల్లడించలేదు. ఈ మోడల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 60 kWh బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. దీని ద్వారా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
ప్రస్తుతం దీనిని నిరంతరంగా పరీక్షిస్తున్నారు. అన్నీ విజయవంతం అయితే 2025లో ఎప్పుడైనా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే డిజైన్ తో పాటు ఈవీఎక్స్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మారుతి నుంచి వచ్చే మొదటి ఎలక్ట్రిక్ కారు కావడంతో ఈ కంపెనీని కోరుకునేవారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.