Toxic Tabahi Song Review: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం పై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్నీ అనుకున్న విధంగా జరిగి ఉండుంటే ఈ చిత్రం ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చి 19 న విడుదల అయ్యి ఉండేది. కానీ బెస్ట్ ఔట్పుట్ కోసం జూన్ కి వాయిదా వేశారు. అప్పటికీ కూడా ఔట్పుట్ రెడీ గా లేకపోవడం ఆగస్టు 26 కి వాయిదా వేశారు. ఈసారి ఎలాంటి ఆలస్యం ఉండదు , మరోసారి వాయిదా కూడా ఉండదు, కచ్చితంగా ఆ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇక నేడు ఈ చిత్రం నుండి కాసేపటి క్రితమే ‘తబాహి’ పాటని విడుదల చేశారు. తెలుగు వెర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా, విశాల్ మిశ్రా సంగీతం అందించారు. టీజర్ , ట్రైలర్ లాగానే ఈ సాంగ్ కూడా చాలా బోల్డ్ గా ఉంది. హీరో హీరోయిన్ మధ్య పాట మొత్తం చూపించిన రొమాన్స్ కి యూత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. హీరో కి ఏ మూడ్ వచ్చినా హీరోయిన్ కియారా అద్వానీ తో రొమాన్స్ చేయడానికి వెళ్లిపోతుండడం గమనార్హం. మాఫియా డాన్స్ తో డీల్ మాట్లాడుతున్నప్పుడు , హీరో కి ఎదో అసంతృప్తి కలుగుతుంది. అప్పుడు మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్ళిపోయి హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ మీటింగ్ లో హీరో కి అక్క పాత్ర పోషించిన నయనతార కూడా ఉంటుంది.
ఇక హీరోయిన్ కియారా అద్వానీ కూడా లిమిట్స్ దాటేసింది. హీరో తో బోల్డ్ రొమాన్స్ చేయడానికి ఆమె అన్ని విధాలుగా సహకరించింది. ఈ రేంజ్ రొమాన్స్ చేయడానికి ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్రా అనుమతి ఇవ్వడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా లో తనకు సంబంధించిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలను తొలగించాలని కియారా అద్వానీ కోరినట్టు ఒక ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కియారా అద్వానీ ఆ తర్వాత ఒక క్లారిటీ ఇచ్చింది. ఈరోజు ఈ పాట చూసిన తర్వాత అర్థమైంది , అది ఏ రేంజ్ బోల్డ్ రొమాన్స్ అనేది. ఇక ట్యూన్ కూడా బాగానే క్యాచీ గా ఉంది , రామజోగయ్య శాస్త్రి మరోసారి తన మార్క్ చూపించారు. కేవలం పాటలోనే ఇంత రొమాన్స్ ఉంటే , ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

