HDFC Scheme: హెచ్‌డీఎఫ్‌సీ సూపర్ స్కీమ్.. ప్రీమియం కడితే సంవత్సరానికి రూ.2.8 లక్షలు!

Hdfc Scheme:  ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు తీపికబురు అందించింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా సిస్టమ్యాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ను ఈ సంస్థ తీసుకొచ్చింది. రిటైర్మెంట్ కోసం ఇప్పటినుంచే డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరేవాళ్లు పాలసీ తీసుకునే సమయంలోనే యాన్యుటీ వడ్డీ రేటును లాక్ చేసుకునే ఛాన్స్ ఉంది.   నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది […]

Written By: Kusuma Aggunna, Updated On : December 28, 2021 6:07 pm
Follow us on

Hdfc Scheme:  ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు తీపికబురు అందించింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా సిస్టమ్యాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ను ఈ సంస్థ తీసుకొచ్చింది. రిటైర్మెంట్ కోసం ఇప్పటినుంచే డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరేవాళ్లు పాలసీ తీసుకునే సమయంలోనే యాన్యుటీ వడ్డీ రేటును లాక్ చేసుకునే ఛాన్స్ ఉంది.

HDFC Scheme

 

నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున యాన్యుటీ ప్లాన్ సహాయంతో పొందే మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మరో బెనిఫిట్ కూడా ఉంది. కస్టమర్లు 5 నుంచి 15 ఏళ్ల ప్రీమియం ఎంచుకునే ఆప్షన్ ఉండగ్తా కస్టమర్ మరణిస్తే నామినీ డిపాజిట్ చేసిన మొత్తాన్ని పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వెబ్‌సైట్‌ ద్వారా ఎలాంటి మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా ఈ పాలసీని తీసుకోవచ్చు.

Also Read: Fenugreek Leaves: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?

రిటైర్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ పెన్షన్ ను పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. కస్టమర్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. చెల్లించే ప్రీమియంను బట్టి యాన్యుటీ, ఇతర బెనిఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్లాన్ లో లైఫ్ యాన్యుటీ, లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ప్రీమియం ఆప్షన్లు ఉంటాయి.

45 నుంచి 75 సంవత్సరాల వయస్సు వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి 2 లక్షల రూపాయల చొప్పున పదేళ్లు ప్రీమియం చెల్లిస్తే 16వ సంవత్సరం నుంచి ప్రతి నెలా 2.8 లక్షల రూపాయల చొప్పున లైఫ్ లాంగ్ పొందవచ్చు.

Also Read: 2021 Roundup: ఆటో మొబైల్ రంగంలో ‘చిప్స్’ కొరత.. తగ్గిన టూ, ఫోర్ వీలర్ అమ్మకాలు..