https://oktelugu.com/

Stock market : బ్యాంకింగ్ అద్భుతం.. ఐదు రోజుల్లో 32వేల కోట్లు సంపాదన.. ఇది ఎలా సాధ్యమైందంటే?

సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఎనిమిదింటి మార్కెట్ క్యాప్ గత వారం బాగా పడిపోయింది. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.1,28,913.5 కోట్లు క్షీణించింది. ఈ కాలంలో, టాటా గ్రూప్ యొక్క ఐటీ దిగ్గజం టీసీఎస్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. కేవలం ఐదు రోజుల మధ్య టాప్ 10లో ఎనిమిది సంస్థలు నష్టపోయాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 04:16 PM IST
    Follow us on

    Stock market : గత వారం మార్కెట్లో టీసీఎస్, రిలయన్స్ లాంటి భారీ కార్పొరేట్ సంస్థలు తీవ్ర నష్టాల్లో ఉంటే ఓ ప్రైవేట్ బ్యాంక్ మాత్రం సంపాదన లో దూసుకెళ్తున్నది. దీని షేర్లు అదరగొడుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్ సీ మార్కెట్ విలువ పెరిగింది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 1.17 శాతం పెరిగి రూ. 1658.05 స్థాయికి చేరింది. వీటితో పాటు ఎల్ ఐసీ పెట్టుబడిదారులు కూడా గతవారం భారీ ప్రయోజనాలు పొందారు. గత వారం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లకు కూడా ప్రత్యేకం. మార్కెట్ లో పెద్ద అలజడి రేగింది. దేశంలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క టాప్ 10 సెన్సెక్స్ ఇండెక్స్‌లో, 8 అత్యంత విలువైనవి ఐదు రోజుల్లో టాప్ 10 లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువలో భారీ క్షీణత నెలకొంది. ఇక ప్రైవేట్ బ్యాంక్ లో రారాజుగా వెలుగొందుతున్న హెచ్డీఎఫ్సీ మాత్రం భారీ అంచనాలు దాటింది. ఈ బ్యాంక్ షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు కేవలం కేవలం 5 రోజుల్లోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ.32,000 కోట్లు ఆర్జించారు. మార్కెట్ నష్టాల్లో ఉంటే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ బ్యాంకింగ్ దిగ్గజం అద్బుతాలు చేసింది. పెట్టుబడిదారుల్లో సంతోషం నింపింది. అది ఎలాగో తెలుసుకుందాం?

    టీసీఎస్, ఇన్ఫోసిస్ నష్టాల బాట
    సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఎనిమిదింటి మార్కెట్ క్యాప్ గత వారం బాగా పడిపోయింది. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.1,28,913.5 కోట్లు క్షీణించింది. ఈ కాలంలో, టాటా గ్రూప్ యొక్క ఐటీ దిగ్గజం టీసీఎస్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. కేవలం ఐదు రోజుల మధ్య టాప్ 10లో ఎనిమిది సంస్థలు నష్టపోయాయి. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. ఇది కాకుండా రిలయన్స్, ఐటీసీ నుంచి ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్ వరకు కంపెనీల మార్కెట్ విలువ తగ్గింది. గత వారం, 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 350.77 పాయింట్లతో 0.43 శాతం పడిపోయింది.

    కంపెనీల నష్టాలు ఇవే..
    టీసీఎస్ 37,971.83 కోట్లు నష్టపోయి 15,49,626.88 కోట్లు మార్కెట్ వద్ద నిలిచిపోయింది. ఇక ఇన్ఫోసిస్ 23,811.88 కోట్లు నష్టపోయింది. వీటితో పాటు ఐటీసీ, ఎస్బీఐ, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ, హెచ్ యూఎల్ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ గత వారంలో భారీగా తగ్గింది. దీనికి విరుద్దంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో పెట్టబడి పెట్టినవారికి మాత్రం లాభం దక్కింది. బ్యాంకు మార్కెట్ విలువ రూ.32,759.37 కోట్లు పెరిగి రూ.12,63,601.40 కోట్లకు చేరింది. అంతే కాకుండా దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ కూడా అద్భుతాలు చేసింది. ఎల్‌ఐసీ మార్కెట్ విలువ ఐదు రోజుల్లో రూ.1,075.25 కోట్లు పెరిగి రూ.7,47,677.98 కోట్లకు చేరుకుంది.

    నష్టపోయినా అగ్రస్థానం..
    ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నష్టపోయినా, టాప్ టెన్ జాబితాలో మాత్రం అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది. దీని తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీలు ర్యాంక్‌లు సాధించాయి. ఈ ప్రముఖ కంపెనీలు గత వారంలో నష్టాల బాట పట్టాయి. మరి ఈ వారం ఎలా ఉంటుందో వేచి చూడాలి.