Google Digital Payments : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగం పుంజుకుంటున్నాయి. చాలా వరకు దేశాల్లో ప్రజలు లిక్విడ్ కరెన్సీ కాకుండా..ఆన్ లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల వైపు దృష్టి సారించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశమైన భారత్ లో యూపీఐ(UPI) ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో చెల్లింపుల వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. ఇది ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ తన పేమెంట్స్ యాప్ గూగుల్ పే(Google pay) సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ సేవలు నిలిచిపోయేది మనదేశంలో కాదు.. అమెరికాలో.. తన పేమెంట్ యాప్ ను మరింత సులభతరం చేసి, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ ప్రకటించింది. గూగుల్ పే(Google pay) సేవలను గూగుల్ (Google wallet) వాలెట్ కు బదిలీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.. గూగుల్ పే(Google pay) సేవలు జూన్ 4, 2024 తర్వాత వినియోగదారులు పొందలేరని ప్రకటించింది.. వాణిజ్య వర్గాల లెక్కల ప్రకారం అమెరికాలో గూగుల్ పే(Google pay) కంటే గూగుల్ (Google wallet) వాలెట్ వినియోగించే వారి సంఖ్య ఐదు శాతం ఎక్కువ. ట్రాన్ సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, స్టేట్ ఐడి, తదితర డిజిటల్ వస్తువులు, ట్యాప్, పేమెంట్ కార్డులను భద్రపరచుకునేందుకు అక్కడి ప్రజలు గూగుల్ (Google wallet) వాలెట్ ను వినియోగిస్తుంటారు.
గూగుల్ పే(Google pay) సర్వీసులను అమెరికాలో నిలిపివేస్తున్నామని గూగుల్ ప్రకటించిన నేపథ్యంలో..ఆ ప్రభావం భారత్ లో ఉండదని ఆ సంస్థ చెబుతోంది. ” ఆన్ లైన్ చెక్ ఔట్, స్టోర్ లలో గూగుల్ పే(Google pay) ద్వారా చెల్లింపులు జరపవచ్చు. గూగుల్ పే(Google pay) ద్వారా భారత్, సింగపూర్ ప్రజలు అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే వారి విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. అమెరికాలోని వినియోగదారులు జూన్ 4, 2024 తర్వాత గూగుల్ పే(Google pay) వెబ్ సైట్ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసుకోవచ్చని” గూగుల్ ప్రకటించింది. అయితే ఇటీవల UPI ద్వారా ఆన్ లైన్ లావాదేవీలను సింగపూర్, శ్రీలంక ప్రాంతాలకు భారత్ ప్రారంభించిన నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే(Google pay) సేవల నిలుపుదల అమెరికాతోనే ఆగిపోదని.. భవిష్యత్తులో మిగతా దేశాల్లోనూ ఈ సేవలను గూగుల్ నిలిపి వేస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.