https://oktelugu.com/

Upasana : పెద్ద కుటుంబానికి చెందిన ఆ యంగ్ హీరో అంటే ఉపాసనకు నచ్చదా… షాకింగ్ రీజన్!

ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో వైస్ ఛైర్ పర్సన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూ .. వైద్య రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ' బి పాజిటివ్ ' అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్ గా ఉన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 7:05 pm
    Upasana shocking comments on second pregnancy
    Follow us on

    Upasana : రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యాన్స్ ఆమెను ఎంతగానో అభిమానిస్తుంటారు. ఒక వైపు ఇంటి బాధ్యతలు, మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉంటారు. అంతే కాదు పేదల కొరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. చిరంజీవి కోడలిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆమెకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఉపాసన కి టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో అంటే ఇష్టం ఉండదట. ఒకవేళ ఆ హీరో ఎదురుపడినా పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడదట.

    ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అట. ఉపాసన అఖిల్ ని ఇష్టపడదట. పొరపాటున ఎదురుపడినా అఖిల్ తో మాట్లాడదట. కాగా దీని వెనుక గట్టి కారణం కూడా ఉందట. అఖిల్ గతంలో బిజినెస్ నేపథ్యం కలిగిన శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కారణం ఏదైనా ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఉపాసన, శ్రియ భూపాల్ క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఈ కారణంగానే అఖిల్ మీద ఉపాసనకు నెగిటివ్ ఒపీనియన్ ఉందట.

    ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ వైరల్ గా మారింది. అయితే చిరంజీవి-నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే రామ్ చరణ్ కి అఖిల్ అంటే చాలా ఇష్టం. అఖిల్ పుట్టినరోజు ఇద్దరూ కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ క్రమంలో అఖిల్ కి ఉపాసన అంటే పడదన్న న్యూస్ ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేకపోవచ్చు కూడాను. ఎందుకంటే ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

    ఇక ఉపాసన – రామ్ చరణ్ దంపతులు పెళ్ళైన పదేళ్ల తర్వాత క్లీన్ కార కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపాసన…. సెకండ్ ప్రెగ్నెన్సీ కి సిద్ధంగా ఉన్నాను అని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో వైస్ ఛైర్ పర్సన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూ .. వైద్య రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ‘ బి పాజిటివ్ ‘ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్ గా ఉన్నారు.