Trai New Rules For Recharge: ఇప్పుడు ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు అనేవి కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మండి. చేతుల్లో డబ్బులు లేకున్నా సరే మొబైల్ ఫోన్ ఉండాలి అనేంతలా దీనికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఒకప్పటి లాగా కాకుండా జియో సిమ్ వచ్చిన తర్వాత ప్లానింగ్ రీచార్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంటే రోజుల చొప్పున రీచార్జ్ చేసుకునేవి వచ్చాయి.

అయితే మనకు తెలిసనంత వరకు మొబైల్ రీచార్జ్‌లు అనేవి 28 రోజులు ఉంటాయి. లేదంటే 84రోజులు ఉంటాయి. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా.. నెలకు 30రోజులు ఉంటాయి కాబట్టి 30రోజులు ఎందుకు రీచార్జ్ ప్లాన్ ఇవ్వరో అని. ఇక్కడే టెలికాం కంపెనీల పెద్ద ప్లాన్ ఉంది. అదేంటంటే.. నెలకు 30రోజులు ఇస్తే సంవత్సరానికి కేవలం 12సార్లు మాత్రమే రీచార్జ్ చేసుకుంటాం.
Also Read: జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?
కానీ 28 రోజులు ప్లాన్ అయితే.. సంవత్సరంలో 13సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అదెలా అంటే.. నెలలో 2రోజులు మిగులుతాయి. ఇలా 12నెలలకు 2రోజుల చొప్పున 24 రోజులు అవుతాయి. అంతే కాకుండా కొన్ని నెలల్లో 31రోజులు ఉంటాయి. అవి కూడా జమచేస్తే మొత్తం 13 సార్లు మనం రీచార్జ్ చేసుకోవడం వల్ల టెలికాం సంస్థలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది.

ఇందులో అత్యధికంగా జియో సంస్థకు 6వేల కోట్లకు పైబడి ఆదాయం వస్తే.. ఆ తర్వాత ఎయిర్ టెల్ కంపెనీకి రూ.5వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఐతే ట్రాయ్ సంస్థ ఒక్కో ప్లాన్‌లో 30రోజులు ఉండేటా రీచార్జ్ ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ టెలికాం సంస్థలు ఈ ఆదేశాలను త్వరలోనే అమలు చేస్తే.. మనకు ఖర్చు తగ్గిపోతుంది.