https://oktelugu.com/

Sri Reddy Reaction on Bheemla Nayak Trailer: భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ మీద శ్రీరెడ్డి సెటైర్లు.. దారుణంగా స్పందించింది..!

Sri Reddy Reaction on Bheemla Nayak: టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా భీమ్లానాయ‌క్ ప్ర‌భంజ‌న‌మే వినిపిస్తోంది. సునామీ వ‌చ్చే ముందు హెచ్చ‌రికల్లా ఈ మూవీ వ‌చ్చే ముందు ఫ్యాన్స్ హంగామా అలా ఉంది. పైగా ఆల్రెడీ హిట్ మూవీకి రీమేక్ కావ‌డం, పైగా ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాణా క‌లిసి న‌టించ‌డంతో అంచనాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇక ప్ర‌మోష‌న్ లో భాగంగా నిన్న ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. మొద‌టి నుంచి ఓ […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 22, 2022 / 03:30 PM IST
    Follow us on

    Sri Reddy Reaction on Bheemla Nayak: టాలీవుడ్‌లో గ‌త కొద్ది రోజులుగా భీమ్లానాయ‌క్ ప్ర‌భంజ‌న‌మే వినిపిస్తోంది. సునామీ వ‌చ్చే ముందు హెచ్చ‌రికల్లా ఈ మూవీ వ‌చ్చే ముందు ఫ్యాన్స్ హంగామా అలా ఉంది. పైగా ఆల్రెడీ హిట్ మూవీకి రీమేక్ కావ‌డం, పైగా ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాణా క‌లిసి న‌టించ‌డంతో అంచనాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇక ప్ర‌మోష‌న్ లో భాగంగా నిన్న ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.

    Sri Reddy

    మొద‌టి నుంచి ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెంచుకున్న ఈ మూవీ.. సాంగ్స్ తో దాన్ని మ‌రింత పైకి తీసుకెళ్లింది. అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ మూవీకి రీమేక్ గా వ‌స్తున్న ఈ మూవీలో ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు కూడా చేశారు. పైగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌గ్గ‌రుండి అన్ని ప‌నుల‌ను చూసుకుంటున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అవుతోంది.

    Also Read:  జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?

    ఎందుకంటే యంగ్ డైరెక్ట‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు కాబ‌ట్టి.. అన్ని ప‌నుల‌ను త్రివిక్ర‌మ్‌కు అప్ప‌గించాడంట ప‌వ‌న్ క‌ల్యాణ్. రిలీజ్‌కు రెడీ అయిన ఈ మూవీ ఇప్ప‌టికే రూ.120కోట్ల బిజినెస్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక నిన్న వ‌చ్చిన ట్రైల‌ర్ అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా భీమ్లానాయ‌క్ ఫీవ‌రే క‌నిపిస్తోంది.

    Bheemla Nayak

    సాగర్ కె చంద్ర డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ మీద ప‌వ‌న్ అన‌గానే ఒంటి కాలి మీద లేచే శ్రీరెడ్డి స్పందించింది. ట్రైల‌ర్ అనుక‌న్నంత లేద‌ని, చాలామందికి న‌చ్చ‌లేదంటూ ట్వీట్ చేసింది. పైగా దీన్ని బిల్లా నాయ‌క్ అంటూ ప‌క్క‌నే న‌వ్వుతున్న‌ట్టు ఉండే ఎమోజీల‌ను పెట్టింది. ఇందుకు అంటే ఎప్ప‌టి లాగే ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొట్టింద‌న్న మాట‌. ఇక మూవీ రిలీజ్ అయితే ఆమె ఎలా స్పందిస్తుందో అని అంతా చ‌ర్చించుకుంటున్నారు.

    Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?

    Tags