https://oktelugu.com/

Good News for Investors : ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..: లాభాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పైపైకి..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్ 19) ఉదయం ప్రారంభం కాగానే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ గణనీయమైన లాభాలు నమోదు చేస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2024 / 03:48 PM IST

    Good News for Investors

    Follow us on

    Good News for Investors : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్ట్ 19) ఉదయం నుంచే లాభాలతో మొదలయ్యాయి. ఇక ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 143.48 పాయింట్లు లాభపడింది. దీంతో 80,580 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడింది. దీంతో 24,612 వద్ద ట్రేడ్ నడుస్తున్నది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు కొంత మిశ్రమ ఫలితాలను చవిచూస్తుంటే, దేశీయ మార్కెట్లు మాత్రం లాభాల వైపు దూసుకెళ్తున్నాయి. ఇక మదుపర్లు మాత్రం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా, ప్రస్తుతం డాలరుతో చూసుకుంటే రూపాయి విలువ రూ. 83.89 వద్ద మొదలైంది. ఇక పలువురు ఆర్థిక రంగ నిపుణులు మాట్లాడుతూ మార్కెట్లు మరికొంత కాలం ఇదే విధంగా లాభాలను గడిస్తాయని తెలిపారు. మొత్తంగా దేశీయ మార్కెట్లు ఈ వారం మొదటి రోజు మార్కెట్లు తెరిచాక లాభాల బాట పట్టడం మదుపర్లలో సంతోషాన్ని నింపింది. ఇక సెన్సెక్స్-30 లో మొత్తంగా 20 కంపెనీల సూచీలు లాభాల్లో కనిపిస్తున్నాయి. అల్ర్టాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు సోమవారం ఉదయం నుంచి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మరో వైపు నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ యూఎల్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..
    ఇక గత వారంలో అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కాగా సోమవారం ఆసియా- పసిఫిక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ చమురు ధఱ రూ. 79.52 డాలర్లుగా నమోదవుతున్నది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా రూ. 766 కోట్ల విలువైన వాటాలను కొనగా, దేశీయ మదుపర్లు రూ. 2606 కోట్ల వాటాలను కొన్నారు.

    ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో తీసుకున్న ద్రవ్య పాలసీ వివరాలు ఇక ఈనెల 21న బుధవారం విడుదల కానున్నాయి. ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో 2024 ద్వితీయార్థంలో రేట్ల తగ్గింపునకు ఫెడ్ రిజర్వ్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవ్య పాలసీ నిర్ణయ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు ప్రత్యేకంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇక జపాన్ మెషనరీ ఆర్డర్లు(జూన్ కు సంబంధించిన) సోమవారం వెల్లడి కానున్నాయి. దీంతో పాటు జపాన్ కు సంబంధించి గత నెల వాణిజ్య లోటు గణంకాలు కూడా బుధవారం వెల్లడించే అవకాశం ఉంది.

    ఆర్థిక నిపుణుల మాట ఇదే..
    జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ మాట్లాడుతూ, “ఎన్ డేలో 397 పాయింట్లతో కొనసాగుతున్న బుల్ మార్కెట్ స్థిరమైన విజయాన్ని చూపుతున్నది. వాల్యుయేషన్‌లు ఎలివేట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. మార్కెట్‌పై రియల్ పెట్టుబడిదారుల పూర్తి ఆధిపత్యం ఈ బుల్ రన్‌లో ఉంది. డాలర్ ఇండెక్స్ లో 102.4 కి చేరుకొని భారీగా క్షీణించడం కారణంగా ఎఫ్ఐఐలు భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

    అయితే కొన్ని పరిణామాలు వారిని విక్రయించేలా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ వైరుధ్యాన్ని ఎఫ్ఐలు ఎలా దాటుతాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడం కారణంగా బంగారు అభరణాలు, బంగారు రుణ కంపెనీలకు సానుకూల వాతావరణం ఉందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ మార్కెట్లె మరింత లాభాల్లో ట్రేడవుతాయని తెలిపారు. ప్రస్తుతం అన్ని నేత్రాలు జాక్సన్ హోల్, ఎకనామిక్ సింపోజియంపైనే ఉన్నాయని తెలిపారు.