Home Loan: నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి హోమ్ లోన్ తప్పనిసరిగా తీసుకుంటున్నారు. డబ్బు ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా లోన్ ద్వారా అయితే ఈజీగా పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఇంటి నిర్మాణం అవసరం ఉన్నప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ కాలక్రమంలో కొన్ని పరిస్థితుల వల్ల వడ్డీ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించం. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్స్ తగ్గిస్తేనే హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుందని అనుకుంటారు. కానీ మరో విషయంలో కూడా వడ్డీ తగ్గే ఛాన్స్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఒక వ్యక్తి గృహ నిర్మాణం కోసం రుణం తీసుకున్న తర్వాత దాని గురించి పట్టించుకోకుండా నెల నెల ఈఎంఐ చెల్లిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇలా అతడు లోన్ పూర్తి చేసే వరకు తన జీవితం అయిపోతుంది. కానీ మధ్యలో కొన్ని కాంపోనెంట్స్ మారడం వల్ల లోన్ పై వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈఎంఐ భారం కూడా తగ్గించుకోవచ్చు. తాజాగా అక్టోబర్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ కొత్త అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా హోమ్ లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు బాగా తగ్గే అవకాశం ఏర్పడింది.
ఒక వ్యక్తి బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునే సమయంలో రెండు విషయాలపై ఆధారపడుతుంది. వీటిలో ఒకటి బేస్ రేటు.. మరొకటి స్ప్రెడ్. బేస్ రేట్ లో రెపోరేటు, బ్యాంకు మార్జిన్, ఆప్షనల్ చార్జెస్ కలిపి ఉంటాయి. సాధారణంగా రెపోరేట్ తగ్గినా.. పెరిగినా బ్యాంకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. లేదా రిజర్వ్ బ్యాంక్ బేసిస్ పాయింట్స్ తగ్గించిన కూడా వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ఆప్షనల్ చార్జెస్ లో కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.
మరో విషయం స్ప్రెడ్. ఈ స్ప్రెడ్ అంటే ఒక వ్యక్తి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ప్రవర్తన అంటే ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా వ్యవహారాల విషయాలపై బ్యాంకు గమనిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా వ్యవహారాలు బాగుంటే అతనికి వడ్డీ రేటు తగ్గిస్తుంది. అతని ఖాతా వ్యవహారాలు బాగా లేకపోతే వడ్డీ రేటు పెంచుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రుణం తీసుకున్న సమయంలో బేస్ రేట్ 8% ఉంటే.. ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటే అతనికి స్ప్రెడ్ తగ్గిస్తారు. అంటే ఉదాహరణకు 0.5 ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల బేస్ రేట్ 8%, స్ప్రెడ్ 0.5% కలిపి 8.5% వడ్డీ రేటుతో రుణం ఇస్తారు. అలా కాకుండా వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే అతని స్ప్రెడ్ 2% ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల బెస్ట్ 8% ప్లస్ స్ప్రెడ్ 2% కలిపి 10% వడ్డీతో రుణం ఇస్తారు.
అయితే మొన్నటి వరకు స్ప్రెడ్ కు లాక్ పీరియడ్ ఉండేది. అంటే ఒకసారి ఒక వ్యక్తికి సంబంధించిన స్ప్రెడ్ నిర్ణయం అయితే కొన్ని సంవత్సరాల వరకు అదే కొనసాగేది. కానీ ఇప్పుడు ఈ లాక్ పీరియడ్లను తీసేస్తున్నారు. దీంతో సిబిల్ స్కోర్ తగ్గినప్పుడు స్ప్రెడ్ పెరిగి.. సిబిల్ స్కోర్ బాగున్నప్పుడు స్ప్రెడ్ తగ్గితే.. అప్పుడు బ్యాంకులు సంప్రదించి వడ్డీ రేటును తగ్గించమని కోరవచ్చు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల మీ సిబిల్ స్కోర్ ను గుర్తించి వెంటనే బ్యాంకుకు సంప్రదించండి.