https://oktelugu.com/

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు శుభవార్త.. రోజుకు 500 ఎంబీ డేటా ఉచితం!

Airtel: ప్రముఖ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ తాజాగా ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరల పట్ల ఎయిర్ టెల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ టెల్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ప్రీపెయిడ్‌ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500 ఎంబీ డేటాను ఫ్రీగా అందించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ టెల్ నుంచి 500 ఎంబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 28, 2021 / 09:33 AM IST
    Follow us on

    Airtel: ప్రముఖ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ తాజాగా ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరల పట్ల ఎయిర్ టెల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ టెల్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ప్రీపెయిడ్‌ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500 ఎంబీ డేటాను ఫ్రీగా అందించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ టెల్ నుంచి 500 ఎంబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

    ఎయిర్ టెల్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైతే ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటారో వాళ్లకు 500 ఎంబీ ఉచిత డేటా లభించనుంది. ఎయిర్ టెల్ ‎ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం వరకు పెంచగా డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌లపై 20 నుంచి 21 శాతం వరకు పెంచడం గమనార్హం. ఎయిర్ టెల్ కస్టమర్లకు ఎయిర్ టెల్ తాజా నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

    ప్రస్తుతం ఎయిర్ టెల్ మినిమం రీఛార్జ్ విషయానికి వస్తే మినిమం రీఛార్జ్ 99 రూపాయలుగా ఉంది. మినిమమ్ రీఛార్జీ 79 రూపాయల నుంచి 99 రూపాయలకు పెరిగింది. ఎయిర్ టెల్ బాటలో వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ధరలను ఊహించని స్థాయిలో పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు తక్కువగా ఉన్నాయి.

    కొంతమంది ఎయిర్ టెల్ యూజర్లు జియోకు పోర్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎయిర్ టెల్ అదనపు డాటా ఆఫర్లను ప్రకటించింది. జియో కూడా రాబోయే రోజుల్లో టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.