Gold Rates Today: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే27న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,440 గా ఉంది.

Written By: Chai Muchhata, Updated On : May 27, 2024 8:07 am

gold-price-today-once-again-good-news-gold-prices

Follow us on

Gold Price Today: కొన్ని రోజుల కిందటి వరకు హడలెల్తించిన బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. మూడు రోజుల్లో వరుసగా తగ్గి ఆది, సోమవారాలు స్థిరంగా కొనసాగాయి.ద దీంతో బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2334. డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ 30.38 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే27న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,440 గా ఉంది. మే 26న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,400తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం స్థిరంగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,590గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,640 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,440 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,550 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,600తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,440తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,440తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.91,500గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం స్థిరంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,500గా ఉంది. ముంబైలో రూ.91,500, చెన్నైలో రూ.96,000 బెంగుళూరులో 92,500, హైదరాబాద్ లో రూ. 96,000 తో విక్రయిస్తున్నారు.