Sivver and gold
Gold Price Today: నాలుగు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి ధరలు ఏకంగా రూ. 3 వేలకు పైగా పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి లక్షకు చేరింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,940 గా ఉంది. మే 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.200 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,010 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,090గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,860 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,940 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,410 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,540తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,860 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,940తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,860తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,940తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.96,600గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.3000లకు పైగా పెరిగింది. కొన్ని రోజులుగా తగ్గిన వెండి మళ్లీ పెరగడంతో హైదరాబాద్ లో లక్షకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.96,600గా ఉంది. ముంబైలో రూ.96,600, చెన్నైలో రూ.1,01,100 బెంగుళూరులో 93,150, హైదరాబాద్ లో రూ. 1,01,100 తో విక్రయిస్తున్నారు.