https://oktelugu.com/

Gold Rates Today: మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : June 13, 2024 / 09:09 AM IST

    Gold Rates In Holy

    Follow us on

    Gold Price Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అయితే నిన్నటి వరకు తగ్గిన వెండి ఈరోజు రూ.800 పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే.. స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2,320 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 29.260 డాలర్లు పలికింది. దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 13న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,160 గా ఉంది. జూన్ 12న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం రూ.300 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,310 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,320గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,160 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,810 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,880తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,170తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,170తో విక్రయిస్తున్నారు.

    బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.95,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.800 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.91,400గా ఉంది. ముంబైలో రూ.91,400, చెన్నైలో రూ.95,900 బెంగుళూరులో 90,850, హైదరాబాద్ లో రూ. 95,900 తో విక్రయిస్తున్నారు.