Gold Price Today: బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 1న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,750 గా ఉంది. మే 31 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.200 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,900గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,690 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,750 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,290 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,410 బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,690 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,750తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,690తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,750తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.95,400గా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.95,400గా ఉంది. ముంబైలో రూ.95,400, చెన్నైలో రూ.99,900 బెంగుళూరులో 95,700, హైదరాబాద్ లో రూ. 99,900 తో విక్రయిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Gold rates today good news for gold buyers 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com