Gold Price Today: బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. నెలరోజులగా గరిష్టంగా పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 5 రోజుల్లో మొత్తం రూ.2,500 తగ్గడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్న ఒక్కరోజే రూ.2,500 దిగి రావడంతో కొనుగోలు దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగానే బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణం అని తెలుస్తోంది.
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 24న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,150 గా ఉంది. ఏప్రిల్ 23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,550తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.1400 తగ్గింది. అయితే 5 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.2500 తగ్గుముఖం పట్టడం విశేషం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,290 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,300 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,140 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,090తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,140 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,150తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,140తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,150తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దిగుతున్నాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.82,900గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.2500 తగ్గింది. నిన్న రూ.1000 తగ్గింది. అంటే రెండు రోజుల్లో రూ.3,500 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.82,900గా ఉంది. ముంబైలో రూ.82,900, చెన్నైలో రూ.86,400, బెంగుళూరులో 85,800, హైదరాబాద్ లో రూ.86,400తో విక్రయిస్తున్నారు.