Sivver and gold
Gold Price Today: బంగారం, వెండి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. శనివారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,740 గా ఉంది. మే 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,850తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.250 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,890గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,750 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,850తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,750తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,750తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.89,000గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.200 తగ్గింది . ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.89,000గా ఉంది. ముంబైలో రూ.89,000, చెన్నైలో రూ.92,400, బెంగుళూరులో 88,400, హైదరాబాద్ లో రూ.92,400తో విక్రయిస్తున్నారు.