Gold Rate Today: బంగారం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధర కూడా తారాజువ్వలాగా పరుగులు పెడుతోంది. గత రెండేళ్లలో బంగారం ధర గ్రాముకు మూడు వేలకు నుంచి పెరిగింది. తద్వారా సోమవారం తులం బంగారం ఏకంగా లక్ష రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 99,860 కు చేరుకుంది. రేపట్నుంచి లక్ష దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,404 డాలర్లు దాటినట్టు తెలుస్తోంది. అమెరికా – చైనా దేశాల మధ్య టారిఫ్ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర అమాంతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ” మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా పెరుగుతున్నాయి. కేంద్రం కూడా ఇటీవల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచింది. తద్వారా బంగారం ధరల్లో కూడా మార్పు వచ్చింది. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. బంగారం ధరలు పెరుగుతాయి. బంగారం ధర తగ్గితే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది.. కానీ ఈసారి క్రూడ్ ఆయిల్ ధరతో పాటు, బంగారం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఆర్థిక యుద్దాల వల్ల బంగారం చుక్కలనంటుతున్నదని” మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ… కేంద్రం కీలక ప్రకటన.
అయినప్పటికీ వినియోగం తగ్గడం లేదు
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సాధారణంగా భారతీయ వివాహాలలో పెళ్లిళ్లకు బంగారం వినియోగం అధికంగా ఉంటుంది. కరోనా తర్వాత వివాహాలు, ఇతర వేడుకలలో బంగారం వినియోగించడం మరింత పెరిగింది. తద్వారా ధర లో కూడా పెరుగుదల ఎక్కువైంది. గత మూడు సంవత్సరాలలో బంగారం ధర 30 వేల వరకు పెరిగింది. ధర ఈ స్థాయిలో ఉన్నప్పటికీ బంగారం కొనే వారు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. చైనా, అమెరికా దేశాల మధ్య ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, చైనాలో బంగారం భారీగానే తయారవుతుంది. కాకపోతే ఆ దేశాలలో బంగారం వినియోగం చాలా తక్కువ. ఇతర దేశాలకు అవి బంగారాన్ని ఎగువ చేస్తుంటాయి. సుంకాల భయం వల్ల ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ పెరగడంతో ధర అంతకంతకు ఎక్కువవుతోంది. అయితే బంగారం ధర లక్ష వరకే ఆగదని.. అంతకుమించి పెరుగుతుందని తెలుస్తోంది. భారత లైవ్ మార్కెట్లో బంగారం ధర లక్షను తాకడం తమను సైతం ఆశ్చర్యపరుస్తున్నదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ” లక్ష మాత్రమే కాదు, మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కడ వరకు ఆగుతుంది అనేది అర్థం కావడం లేదని” ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
Also Read: మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..