Homeబిజినెస్GST on UPI : యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ... కేంద్రం కీలక ప్రకటన.

GST on UPI : యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ… కేంద్రం కీలక ప్రకటన.

GST on UPI : దేశంలో యూపీఐ(UPI) లావాదేవీలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నగదు చెల్లింపులు తగ్గుతున్నాయి. దీంతో కరెన్సీ చెలామణి తగ్గుతోంది. అయితే లావా దేవీలు మాత్రం కొనసాగుతున్నాయి. డిజిటల్‌(Digital) రూపొంలో లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కీలక ప్రకటన చేసింది.

Also Read : యూపీఐ ఐడీ ఇక సేఫ్.. క్రెడిట్ కార్డ్‌లా ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం యూపీఐ(UPI) లావాదేవీలపై జీఎస్టీ విధించబోతోందన్న వార్తలను ఖండించింది. రూ.2,000 పైబడిన లావాదేవీలపై పన్ను విధిస్తున్నట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, డిజిటల్‌ చెల్లింపు(Digital Payment)లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది. శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేస్తూ, యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ(GST) విధించే ఆలోచన లేదని తెలిపింది. కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో రూ.2 వేలు దాటిన లావాదేవీలపై 18% జీఎస్టీ విధించబోతున్నట్లు వార్తలు వ్యాప్తి చేశాయి. ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని, దీనికి ఎలాంటి ఆధారం లేదని కేంద్రం పేర్కొంది. ‘ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదు,‘ అని స్పష్టం చేసింది.

డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహం
యూపీఐ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చింది. 2024లో యూపీఐ ద్వారా నెలవారీ లావాదేవీల సంఖ్య 1,200 కోట్లను దాటగా, విలువ రూ.200 లక్షల కోట్లను అధిగమించిందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, యూపీఐని మరింత ప్రజాదరణ పొందేలా చేయడమే తమ లక్ష్యమని కేంద్రం తెలిపింది. జీఎస్టీ వంటి అదనపు భారాలు విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ధ్రువీకరించింది.

అపోహల నివృత్తి
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఈ వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టించాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు యూపీఐ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్రం వెంటనే స్పందించి అపోహలను నివృత్తి చేసింది. యూపీఐ(UPI) ద్వారా చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని, ఎలాంటి అదనపు పన్నులు లేవని పునరుద్ఘాటించింది.

భవిష్యత్తు దిశగా యూపీఐ
యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే, యూపీఐ ఆటోపే, క్రెడిట్‌ లైన్‌ వంటి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ చర్యలు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించే దిశగా ఉన్నాయి.

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలు పుకార్లుగా తేలాయి. కేంద్రం ఈ అంశంపై స్పష్టతనిచ్చి, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇంకేముంది.. యూపీఐ వినియోగదారులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ లావాదేవీలను కొనసాగించవచ్చు.

Also Read : అటు UPI, ఇటు WhatsApp అంతరాయం.. ఇంతకీ ఏమైంది?

RELATED ARTICLES

Most Popular