Gold price today: పండుగల సీజన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం రోజురోజుకు మరింత పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం లక్షల రూపాయలు ఉన్నప్పుడు భారం అనుకున్నారు. కానీ ఇప్పుడు మరింత పెరుగుతూ ఆకాశాన్నంటుతోంది. మంగళవారం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దీంతో ఇక బంగారం కొనడం చాలా కష్టం.. ఆశలు వదులుకోవాల్సిందే.. అని కొనుగోలుదారులు నిరాశపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 23 ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.1,04,800 నమోదైంది. 24 క్యారెట్ల బంగారం కొనాలంటే రూ.1,14,330 చెల్లించాలి. సోమవారం కంటే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,150 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,260 పెరిగింది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,480గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,800 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,000 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,550గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,480 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,480కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,330గా నమోదైంది.
వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 23న కిలో వెండి ధర రూ.1,49,000గా ఉంది. సోమవారం కంటే మంగళవారం రూ.1,000 పెరిగింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలతోనే బంగారం ధరలు పెరిగాయని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర మొత్తం రూ.37,250 పెరిగింది. ఈ ధరలు మరింతగా కొనసాగుతాయా? లేదా? అనేది చూడాలి. ౌ
అయితే తెలుగు రాష్ట్రాల్లో వివాహం, ఇతర అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలంటే మాత్రం ఆలోచిస్తున్నారు. కొందరు బంగారం తగ్గుతుంది భావిస్తున్నారు. కానీ రోజురోజుకు బంగారం మరింత పెరుగుతోంది. అటు వెండి ధరలు సైతం పెరుగుతుండడంతో కాస్త కొనుగోళ్లు తగ్గాయని అంటున్నారు. కానీ అత్యవసరం ఉన్నవారు మాత్రం ధర ఎంత ఉన్నా కొనుగోలు చేస్తున్నారు.