Gold Prices
Gold Price Today: బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. శుభకార్యాల వేళ ధరలు పెరగడంపై కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2017 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.97 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 20వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 20న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,460గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,680 గా ఉంది. ఫిబ్రవరి 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారం కంటే మంగళవారం రూ.250 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,830గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,460 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,680 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,010 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,280తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,460 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,680తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,460తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,680తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు తగ్గాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,900గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు రూ.500 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,900గా ఉంది. ముంబైలో రూ..75,900, చెన్నైలో రూ.77,400, బెంగుళూరులో 72,900, హైదరాబాద్ లో రూ.77,400తో విక్రయిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Gold price today after a huge shock the prices of gold how much has increased today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com