Top Heroine: టాలీవుడ్ లో మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేక పోతుంది. ఈమె చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కానీ తెలుగులో మాత్రం ఈ బ్యూటీ అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. మొదట్లో బుల్లితెర మీద సందడి చేసిన ఈ బ్యూటీ పలు డాన్స్ షోలలో పాల్గొంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఆశిక రంగనాథ్. ఆశికా రంగనాథ్ 2014లో జరిగిన మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీలలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ బాయ్ అనే సినిమాతో హీరోయిన్గా కన్నడ సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. రాంబో 2 సినిమాలో నటించి మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిన్నది సూపర్ హిట్ అందుకుంది. అలాగే కన్నడలో మదగజ, అవతార పురుష, గరుడ వంటి సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. స్టార్ హీరోల సినిమాలలో ఆషిక కామియో రోల్స్ లో మెప్పించింది. ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు అంతగా క్రేజ్ రాలేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు చాలా ముద్దుగుమ్మలు తెలుగులో కూడా సినిమా అవకాశాలు అందుకొని బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకున్నారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ తో పాటు టాలీవుడ్ లో కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.
కానీ ఆశికా రంగనాథ్ మాత్రం తెలుగులో అంతగా సక్సెస్ కాలేక పోయింది.కానీ తెలుగులో తొలి సినిమాతోనే తన అందంతో, నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఆషిక సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈమెకు చెందిన చిన్ననాటి ఫోటో కూడా సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఎల్లో కలర్ శారీలో చాలా అందంగా ఉన్న ఆషిక ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Also Read: ఎన్టీఆర్ కోసం హెలికాప్టర్ నుండి వార్ ట్యాంకర్లు తెప్పించిన ప్రశాంత్ నీల్..!