BSNL  4G : జియో, ఎయిర్ టెల్ కు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ సంచలనం.. ఇక అందరూ ప్రభుత్వ నెట్ వర్క్ కు మారాల్సిందే

రూ. 26,316 కోట్లతో అన్‌కవర్డ్ గ్రామాలను (మొత్తం 24,680 గ్రామాలు) కవర్ చేసేందుకు 4G సంతృప్త ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వినియోగదారులకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడం దీని లక్ష్యం. ప్రభుత్వం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది.

Written By: NARESH, Updated On : July 23, 2024 7:32 pm
Follow us on

BSNL  4G  : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 4G టవర్లను ఇన్ స్టార్ చేసినట్లు ప్రకటించింది. ఈ సంతృప్త ప్రాజెక్ట్‌తో సంస్థ గ్రామీణ లేదా అన్‌కవర్డ్ గ్రామాలను హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలని అనుకుంటుంది. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ స్వదేశీ 4G టెక్నాలజీ స్టాక్‌ను అమలు చేస్తోంది. నెట్‌వర్క్ కోర్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) అందిస్తోంది. రేడియో గేర్‌ను తేజస్ నెట్‌వర్క్స్ అందిస్తోంది. TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సిస్టమ్స్ ఇంటిగ్రేటర్‌గా వ్యవహరిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కోసం TCS నెట్‌వర్క్‌లను కూడా అందిస్తుంది.

రూ. 26,316 కోట్లతో అన్‌కవర్డ్ గ్రామాలను (మొత్తం 24,680 గ్రామాలు) కవర్ చేసేందుకు 4G సంతృప్త ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వినియోగదారులకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడం దీని లక్ష్యం. ప్రభుత్వం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది.

ఇదే కాకుండా, BSNL భారతదేశం అంతటా దాదాపు లక్ష టవర్లను 4Gకి అప్‌గ్రేడ్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G, 5Gని ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. ఐదేళ్లలో ప్రకటించిన బహుళ ఉపశమన ప్యాకేజీల ద్వారా స్పెక్ట్రమ్ ఇప్పటికే బీఎన్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేయబడింది.

4G రోల్‌అవుట్‌ను వేగంగా ట్రాక్ చేసేందుకు, జవాబుదారీతనాన్ని నిర్ధరించేందుకు దేశం కొత్త టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీఎస్ఎన్ఎల్ రోజువారీ 4G రోల్‌అవుట్ లక్ష్యాలను కలిగి ఉంటుందని ప్రకటించారు. పురోగతిని మంత్రి, టెలికాం సెక్రటరీ ట్రాక్ చేస్తారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ సంస్థ కస్టమర్లను వేగంగా కోల్పోతోంది. కస్టమర్లను పెంచుకునేందుకు ప్రమోషనల్ స్కీమ్‌లను అమలు చేస్తోంది, అయితే, అది కంపెనీ కోసం విజయవంతంగా పాన్ చేయబడిందా? లేదా? అనేది కాలక్రమేణా తెలుస్తుంది.

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ. 107 నుంచి రూ. 1499 వరకు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ సంస్థలో తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. కొత్త ప్లాన్ కోసం చూస్తున్నవారైతే. బీఎస్ఎన్ఎల్ రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపిక. రోజంతా ఫోన్‌లో మాట్లాడినప్పటికీ, ఈ ప్లాన్ సరిపోతుంది.

ఎయిర్‌టెల్, జీయో కంటే కూడా..
బీఎస్ఎన్ఎల్ రూ. 229 ప్లాన్‌ను జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్లతో పోలిస్తే చాలా చవక. ఇందులో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

రూ. 229 ప్లాన్ వివరాలు
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 229తో అపరిమిత కాలింగ్‌ వస్తుంది. ఇందులో 2 GB డేటా లభిస్తుంది. ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నా.. ఆన్‌లైన్ వీడియోలను చూసినా.. సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చించినా, ఈ డేటా కవర్ చేస్తుంది. ఇది కాకుండా ప్రతి రోజూ 100 SMSలు, ఆన్ మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ (On mobile Global Ltd.) ద్వారా ఎరీనా మొబైల్ గేమింగ్ (Arena Mobile Gaming) నుంచి గేమింగ్ ప్రయోజనాలు ఉన్నాయి.

రూ. 229 నెల వాలిడిటీ
ఈ రూ.229 ప్లాన్ ప్లాన్‌ల భిన్నంగా ఉంటుంది. ఇతర ప్లాన్‌ల చెల్లుబాటు నెల కంటే తక్కువ లేదంటే ఎక్కువ. అయితే, ఇది నెల పూర్తికాల వ్యవధితో అందించిన ప్లాన్. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే దీని వాలిడిటీ పూర్తి నెల ఉంటుంది. మీరు జూలై 1న రీఛార్జి చేసుకుంటే.. ఆగస్టు 1 వరకు ఉంటుంది. అంటే ప్రతినెలా అదే తేదీలో మొబైల్‌కి రీఛార్జ్ చేసుకోవచ్చు, మళ్లీ మళ్లీ రీఛార్జి చేసుకునే అవసరం లేదు.