spot_img
Homeబిజినెస్parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు చూసి వాటిని కూడా పొందాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారి తల్లిదండ్రులను అలాంటి వస్తువులు కావాలని ఫోర్స్ చేస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగింది ఇవ్వాలన్న ఉద్దేశంతో వారు అడిగిన ప్రతి వస్తువును కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచిస్తున్నారు. అలా అడిగిన ప్రతి వస్తువు కొనిస్తే వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయని.. ఇవి కష్టాలతో కూడుకొని ఉంటాయని హెచ్చరించారు. అసలు పిల్లలను ఎలా పెంచాలి?

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పిల్లలు అడిగిన వెంటనే వస్తువు కొనిచ్చే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే వారు అడిగిన ప్రతి వస్తువును కొనివ్వడం వల్ల వారికి కష్టం విలువ తెలియకుండా ఉంటుంది. కొన్నిసార్లు వారు అడిగే వస్తువులు తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నా.. ఆ తర్వాత ఖరీదైన వస్తువుల విషయంలో కూడా మారం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం అప్పులు చేసి మరి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉంది.

పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ గురించి తెలియజెప్పాలి. వారికి సాదాసీదా జీవితానికి అలవాటు చేయాలి. కష్టపడకుండా ఏదీ రాదని.. కష్టపడితేనే ప్రతి వస్తువును పొందే అవకాశం ఉంటుందని తెలియజెప్పాలి. కొన్ని అత్యవసర వస్తువులను అడిగిన వెంటనే కొనివ్వవచ్చు.. కానీ విలాస వస్తువుల విషయంలో మాత్రం ఆలస్యం చేయడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంతో కష్టమైన పని అని పిల్లలకు చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వారు కూడా విలాసవంతమైన వస్తువుల విషయంలో ఆలోచిస్తారు.

చాలావరకు తల్లిదండ్రుల జీవన విధానమే పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా కొన్ని ఖరీదైన వస్తువులను పిల్లల ముందు కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వారికి డబ్బు ముఖ్యం కాకుండా క్రమశిక్షణ కూడా చాలా అవసరం అని చెబుతూ ఉండాలి. ఎప్పుడైనా డబ్బు కష్టాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తట్టుకుని సామర్థ్యాన్ని నేర్పించాలి. ఇలా చేయడం వల్ల వారికి ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Oktelugu Epaper