Homeబిజినెస్Flipkart Sale 2025:మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్‌లు.. అన్నీ తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ వచ్చేస్తోంది!

Flipkart Sale 2025:మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్‌లు.. అన్నీ తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ వచ్చేస్తోంది!

Flipkart Sale 2025: కొత్త ఇంటికి కావలసిన వస్తువులు కొనాలని చూస్తున్నారా.. కానీ సేల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ వెయిటింగ్ కు త్వరలోనే స్వస్తి పలకవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చే వారం నుంచి SASA LELE సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్స్ నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. వచ్చే వారం సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఏయే ఉత్పత్తులపై డిస్కౌంట్ ఉంటుంది అనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్: ఎప్పటి నుంచి ప్రారంభం?
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ వచ్చే వారం మే 2, 2025 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌ల కోసం మాత్రం ఈ సేల్ 24 గంటల ముందుగానే మొదలవుతుంది. సేల్‌లో ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, అదనపు తగ్గింపు పొందాలనుకుంటే బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఎక్స్ ట్రా డిస్కౌంట్ ఎలా పొందాలి?
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. SBI క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పూర్తి చెల్లింపు, EMI లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల ప్రయోజనం
ఈ సేల్‌లో బ్లాక్‌బస్టర్ డీల్స్, బై 1 గెట్ 1 డిస్కౌంట్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, డబుల్ డిస్కౌంట్, టిక్‌టాక్ డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. అయితే ఏ ఉత్పత్తిపై ఎంత డిస్కౌంట్ ఉంటుందనే సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ ప్రొడక్టులపై డిస్కౌంట్
సేల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మైక్రోసైట్ ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, హోమ్ అప్లయన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై వినియోగదారులకు తగ్గింపు లభించనుంది. ఈ ఉత్పత్తులపై ఎంత శాతం తగ్గింపు ఉంటుంది లేదా ఎంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version