Homeబిజినెస్Flex Fuel Bikes In India: ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లు కూడా మార్కెట్లోకి.. ధర...

Flex Fuel Bikes In India: ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లు కూడా మార్కెట్లోకి.. ధర ఎంతో తెలుసా..

Flex Fuel Bikes In India: ప్రస్తుత కాలంలో పెట్రోల్ ధరలు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇథనాల్ తో నడిచే బైక్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకీ కంపెనీ నుంచి ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనం రాబోతుంది.అయితే టూవీలర్ లోనూ ఇదే తరహా వాహనం మార్కెట్లోకి రాబోతుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురీ కలిసి ఇటీవల ఢిల్లీలో హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్, హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ అనే బైక్ లను ఆవిష్కరించారు. ఈ బైక్ లు ఎలా ఉండబోతున్నాయంటే?

హీరో మోటోకార్ప్ కంపెనీ భారతదేశంలో ఇథనాల్‌తో నడిచే మొదటి 100సీసీ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్‌+ , హెచ్‌ఎఫ్‌ డీలక్స్ మోడల్‌లను ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వెర్షన్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌లు E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ మిశ్రమాలపై సులభంగా నడుస్తాయి, అంటే 20 నుంచి 85 శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనంపై వీటిని ఉపయోగించవచ్చు.

హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ :
హీరో స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్ ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్ ప్రకారం రూ.82,710 ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ 97.2సీసీ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది E85 ఇంధనంపై నడిచే సమయంలో 8,000 RPM వద్ద 8 హార్స్‌పవర్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ప్లెండర్‌+ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఇది మైలేజ్, ధర పరంగా ఉత్తమంగా ఉంటుంది.

హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్:
హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్ ఢిల్లీ ఎక్స్‌-షోరూమ్ ప్రకారం రూ.72,792 ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ కూడా 97.2సీసీ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది E85 ఇంధనంపై 8,000 RPM వద్ద 8 హార్స్‌పవర్ పవర్‌ను, 6,000 RPM వద్ద 8.3 న్యూటన్‌-మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు.

ధర :
హెచ్‌ఎఫ్‌ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ వెర్షన్, ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎఫ్‌ డీలక్స్ బేస్ వెర్షన్‌ కంటే రూ.13,315 ఎక్కువ. అయితే హెచ్‌ఎఫ్‌ డీలక్స్ Pro వేరియంట్‌ కంటే కేవలం రూ.172 మాత్రమే ఎక్కువ. ఇది చాలా ఖరీదైనది కాదు. స్ప్లెండర్‌+ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ కూడా దాని ప్రామాణిక వెర్షన్‌లతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరకే అందుబాటులో ఉంది.

ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్‌లు జూలై 2026 నుంచి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బైక్‌ల ప్రవేశం భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాలను స్వీకరించడం , పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version