https://oktelugu.com/

Financial Year Ending: మార్చి 31లోపు ఈ పనులు కచ్చితంగా చేయండి..

2024 మార్చి 31 ఆదివారంతో ముగుస్తుంది. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మారుతున్నందున కొన్ని వ్యవహారాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు కేవైసీలను ఈ 31 లో గా పూర్తి చేయాలని కొన్ని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 29, 2024 / 12:50 PM IST

    march 31 financial Year

    Follow us on

    Financial Year Ending: ప్రతీ సంవత్సరం మార్చి 31 తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఏప్రిల్ 1 నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయిర్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను, ఆదాయపు పన్నుకు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సం ముగిసిన తరువాత వీటిని చెల్లించాలని అనుకున్నా ఫెనాల్టీ పడుతుంది. బిల్లులు మాత్రమే కాకుండా కొన్ని బ్యాంకుకు సంబంధించిన పనులు కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే?

    2024 మార్చి 31 ఆదివారంతో ముగుస్తుంది. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మారుతున్నందున కొన్ని వ్యవహారాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు కేవైసీలను ఈ 31 లో గా పూర్తి చేయాలని కొన్ని బ్యాంకులు సూచిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా మార్చి 31 లోపు తమ కేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లో ఆధార్, పాన్ వివరాలను లేకపోతే 31 లోగా సంబంధిత బ్యాంకుల్లో సమర్పించాలి.

    సొంత ఇల్లు కట్టుకునేవారు బ్యాంకు రుణం తీసుకోవాలనుకుంటే ఈ 31లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అందుతాయి. రాయితీ విషయంలో కొన్ని సౌలభ్యాలను కల్పిస్తూ రుణాలను అందిస్తున్నాయి.ఆదాయపు పన్నును చెల్లించాలనుకునేవారు 31లోగా చెల్లించాలి. లేకుంటే ఫెనాల్టీ పడుతుంది. ముఖ్యగా పన్ను శాఖ వారు నోటిసులు అందించిన వారు తప్పనిసరిగా ఇన్ కం టాక్స్ ను చెల్లంచాలి. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్నును చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. అయితే గడువు దాటిన వాటికి పెనాల్టీ పడొచ్చు.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ‘అమృత్ కలశ్’ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకు అవకాశాలు లేవు. ఎందుకంటే శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో కొత్త పెట్టుబడుల దరఖాస్తుకు సంబంధించి ఆమోదం తెలపలేవు. ఒకవేళ ఇప్పుడు పెట్టుబడులు పెట్టినా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లోకి యాడ్ అవుతాయి.