Pallavi Prashanth: జైల్లో రెండు రోజులు నరకం, వాళ్లకు నా గతే పడుతుంది… బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అంత బాధ పడ్డాడా!

జీవితంలో రెండు చోట్లకు వెళ్లకూడదు ఒకటి హాస్పిటల్, రెండోది జైలు అని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జైలుకు వెళ్తానని అస్సలు అనుకోలేదని, చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశాంత్ అన్నాడు.

Written By: S Reddy, Updated On : March 29, 2024 12:50 pm

Pallavi Prashanth

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫినాలే రోజున జరిగిన అల్లర్ల కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అతనికి టైటిల్ గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఫ్యాన్స్ అత్యుత్సాహం తో విధ్వంసం సృష్టించారు. ఆ అల్లర్లకు పరోక్షంగా పల్లవి ప్రశాంత్ కారణం అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ జైలు తనకు జీవితం అంటే ఏమిటో నేర్పిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జీవితంలో రెండు చోట్లకు వెళ్లకూడదు ఒకటి హాస్పిటల్, రెండోది జైలు అని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జైలుకు వెళ్తానని అస్సలు అనుకోలేదని, చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశాంత్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ .. ‘ నేను బిగ్ బాస్ కి వెళ్లాలని అనుకున్నా కానీ .. జైలుకు పోవాలని అనుకోలేదు. అసలు ఎవరు అనుకోరు. నేను ఎప్పుడు జైలుకు పోలేదు. చేయని తప్పుకి జైలుకు వెళ్ళాను.

నాకు జైలు కూడు రాసి పెట్టుంది. జైలుకు వెళ్లిన తర్వాత చాలా బాధ పడ్డాను. నేను బయటకు రావాలని చాలా మంది కోరుకున్నారు. భోలే అన్నతో పాటు వందల మంది లాయర్లు నాకు సహాయం చేయడానికి వచ్చారు. జైల్లో రెండు రోజులు తినకుండానే ఉన్నాను. అన్నా తిను అంటూ తోటి ఖైదీలు బతిమాలితే వాళ్ళ కోసం తిన్నాను. జైలు కూడు బాగుంది. ఖైదీలంతా నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా అని మాట్లాడేవారు. నేను జైలుకు పోయానని భయపడ లేదు. తప్పు చేయలేదు కాబట్టి భయపడలేదు.

ఎవరో చేసిన దానికి నేను జైలుకు వెళ్ళాను. శిక్ష అనుభవించాను. పారిపోయానని అన్నారు. నేను ఎక్కడికి పోలేదు .. ఇంటి దగ్గరే ఉన్నా. నాకు పట్టిన గతే నన్ను విమర్శించే వారికి కూడా పట్టొచ్చు. బిగ్ బాస్ బతుకు నేర్పింది. జైల్లో చాలా జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నాను’ అన్నాడు. పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.