https://oktelugu.com/

Car meaning In Telugu: కారును తెలుగులో ఏమంటారో తెలుసా?

కార్ అనేది ఇంగ్లీష్ పదం. కానీ కారును తెలుగులో ఏమంటారు? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అసలు కారును తెలుగులో ఏమంటారంటే?

Written By: , Updated On : March 29, 2024 / 12:32 PM IST
compact suv car

compact suv car

Follow us on

Car meaning In Telugu: ప్రయాణ సాధనాల్లో కారు ఒకటి. నలుగురు నుంచి 10 మంది వరకు ఒకేసారి ప్రయాణించాలంటే ఈ వాహనం సౌకర్యవంతంగా ఉంటుంది. కారులో ప్రయాణించాలని చాలా మందికి ఉంటుంది. ఒకప్పడు కొందరి ఇళ్లల్లో మాత్రమే కారు ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది సొంత వెహికల్ ను కలిగి ఉంటున్నారు. అంతేకాకుండా సామాన్యులకు అనుగుణంగా తక్కువ ధరలో కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో కారు కొనడం చాల తేలిక అయింది. కార్ అనేది ఇంగ్లీష్ పదం. కానీ కారును తెలుగులో ఏమంటారు? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అసలు కారును తెలుగులో ఏమంటారంటే?

ఇండియాలో ప్రయాణ సాధనం ఎడ్ల బండి నుంచి మొదలైంది. ఇప్పుడు పెద్ద పెద్ద విమానాలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం కారును కొనుగోలు చేస్తారు. కార్యాలయాల అవసరాల నిమిత్తం, ఫ్యామిలీతో బయటకు వెళ్లడానికి కారు సౌకర్యంగా ఉంటుంది. వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. చిన్న కారు నుంచి 10 మంది ఒకేసారి ప్రయాణించే వాహనాలు వచ్చాయి. వారి వారి అవసరాల నిమిత్తం వివిధ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చాలా మంది కారు ను తెలుగులో ఏమంటారు? అనే సందేహం వచ్చి ఉంటుంది. Car అనేది ఇంగ్లీష్ పదం.దీనికి తెలుగులో ప్రత్యేకంగా ఎలాంటి పదం కేటాయించలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం శకటం లేదా రథం అని పిలుస్తారు. కానీ ఈ పదాలకు అర్థం వేరే ఉంది. కారు కు మాత్రం తెలుగులో ఎలాంటి పదం లేదు. కార్ అనే పదం ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒకరి వెంట మరొకరు అలాగే వాడుతున్నారు.

అందువల్ల కార్ కు ఎలాంటి తెలుగు పదం లేదని తెలుసుకోవాలి. ఇక కొన్ని సంవత్సరాల నుంచి కార్ల వినియోగం పెరిగిపోతుంది. కంపెనీలు సైం వినియోగదారులను ఆకర్షించేలా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ కార్ల వరకు మార్కట్లో అందుబాటులో ఉన్నాయి.