Financial Tasks: భారత దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 28 రోజేలే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు కొన్ని ఆర్థిక పనులు పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈ మార్చి 31లోపు ఏయే పనులు పూర్తి చేయాలో తెలుసుకుందాం.
అంతా బిజీ..
మార్చి వచ్చిందంటే బ్యాంకులు, ఇతర సంస్థల ఉద్యోగులు బిజీ అయిపోతారు. ఇక సామాన్యులది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 చివరి రోజు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ 31లోపు ఈ పనులు పూర్తి చేయాలి.
ఆధార్ ఫ్రీ అండేషన్..
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయినవారు అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకు ఫ్రీ అప్‌డేషన్ అవకాశం కల్పించింది. ఇందుకు పలుమార్లు గడువు పెంచింది. ఈమార్చి 14తో ఈ గడువు ముగుస్తుంది. తర్వాత ఫ్రీ అప్‌డేషన్ ఉండదు.
ఎంప్లాయ్ టాక్స్ సేవింగ్ స్కీం..
2023–2024 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయ్ టాక్స్ సేవింగ్ స్కీం పొందేందుకు వివిధ పెట్టుబడులు పెట్టేవారు మార్చి 31 వరకు పూర్తి చేయాలి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధియోజన, ఈఎల్‌ఎస్‌ఎస్ వంటి స్కీంలలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఐటీ రిటర్న్ దాఖలు..
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి కూడా మార్చి 31 చివరి తేదీ. 2023–24 సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్, చివరి వాయిదా చెల్లించడానికి మార్చి 15 వరకు అవకాశం ఉంది. ఈ తేదీలోపు పన్ను చెల్లింపుదారులు ముందస్తు పన్ను చెల్లించకపోతే జరిమానా పడుతుంది.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఎఫ్‌డీ, వీకేర్ ఎఫ్‌డీ..
ఈ రెండు స్కీంల గడువు కూడా మార్చి 31తో ముగుస్తుంది. అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీంలో 400 రోజుల టెన్యూర్ కలిగిన ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ద్వారా జనరల కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ స్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ ఉంది. వీకేర్ ఎఫ్‌డీ స్కీంను ఎస్‌బీఐ కరోనా సమయంలో ప్రకటించింది. దీని గడువు చాలాసార్లు పొడగించింది. ఈ మార్చి 31తో దీని గడువు ముగుస్తుంది. ఈ స్కీం సీనియర్ సిటిజన్స్‌కు బెస్ట్ ఆప్షన్. వృద్ధులకు 50 బేస్ పాయింట్స్ వడ్డీ అదనంగా లభిస్తుంది. సాధారణ డిపాజిటర్లకన్నా వీకేర్ పథకంలో సీనియర్ సిటిజన్లకు అదనంగా 1 శాతం వడ్డీ లభిస్తుంది.
ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఉత్సవ్..
భారత దేశ 76వ స్వాతంతత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆజాదీకా అమృత్ మహాత్సవ్ గా జరుపుకుంటున్న సందర్భంగా ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రాం ప్రవేశపనెట్టింది. ఈ స్కీంలో అధిక వడ్డీ రేటు కలిగి ఉంది. సాధారణ డిపాజిటర్లకు ఏడాదికి 6.10 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా వడ్డీ వస్తుంది. దీని గడువు కూడా మార్చి 31తో ముగుస్తుంది.