రైతులకు అలర్ట్.. ఈ పంటలు పండిస్తే లక్షల్లో లాభం..?

ఇతర కాలాలతో పోలిస్తే పంటలను సాగు చేయడానికి ఖరీఫ్ సీజన్ అనువైన కాలమనే సంగతి తెలిసిందే. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎక్కువ పంటలు భారీ లాభాలను ఇవ్వడం లేదు. అయితే కొన్ని అరుదైన పంటలు వేయడం ద్వారా రైతులు ఆదాయాన్ని భారీగా పెంచుకోవడంతో పాటు లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పలు రకాల మొక్కల సాగు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఖరీఫ్ సీజన్ లో కలబంద సాగు మంచి లాభాలను […]

Written By: Navya, Updated On : June 5, 2021 10:31 am
Follow us on

ఇతర కాలాలతో పోలిస్తే పంటలను సాగు చేయడానికి ఖరీఫ్ సీజన్ అనువైన కాలమనే సంగతి తెలిసిందే. రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎక్కువ పంటలు భారీ లాభాలను ఇవ్వడం లేదు. అయితే కొన్ని అరుదైన పంటలు వేయడం ద్వారా రైతులు ఆదాయాన్ని భారీగా పెంచుకోవడంతో పాటు లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పలు రకాల మొక్కల సాగు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

ఖరీఫ్ సీజన్ లో కలబంద సాగు మంచి లాభాలను ఇస్తుంది. జులై నుంచి ఆగష్టు మధ్యలో కలబంద మొక్కలను నాటితే హెక్టారుకు సగటున 30 – 35 టన్నుల తాజా ఆకులు ఉత్పత్తి కావడంతో పాటు ఎకరాకు ఏకంగా రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఔషధ గుణాలను కలిగి ఉన్న బ్రాహ్మీ మొక్కతో ఎన్నో ఔషధాలు తయారవుతున్నాయి. అర్థరైటిస్ చికిత్స కోసం, మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం ఈ ఆకులు ఉపయోగపడతాయి.

పెట్టుబడికి నాలుగు రెట్ల సంపాదన ఈ పంట ద్వారా సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. మైదాన ప్రాంతాలలో విత్తనాల ద్వారా పండించే కౌంచ్ పంట వేయడం ద్వారా ఎకరాకు ఏకంగా 3 లక్షల రూపాయల వరకు లాభం పొందవచ్చు. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఈ పంటను వేయవచ్చు. ఈ పంటకు ఎకరానికి 3 కిలోల నుంచి 5 కిలోల విత్తనాలు అవసరం అవుతాయని సమాచారం.

మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా పండించే పంటలలో సత్వర్ పంట ఒకటి. ఒక ఎకరాలో ఈ పంట పండిస్తే 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు లాభం వస్తుంది. బహుముఖ ఔషధ గుణాలు ఉన్న మొక్కలలో లెమన్ గ్రాస్ కూడా ఒకటి. ఎకరా లెమన్ గ్రాస్ పంటకు 30వేల రూపాయల నుంచి 40వేల రూపాయల వరకు ఖర్చు అయితే లాభం మాత్రం 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది.