ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త.. ఫీజు రద్దు చేసిన ప్రభుత్వం..?

కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చిరు వ్యాపారులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటం, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం తగ్గించాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న […]

Written By: Navya, Updated On : June 5, 2021 10:34 am
Follow us on

కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చిరు వ్యాపారులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటం, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం తగ్గించాలని ఒడిశా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గిందని చెప్పవచ్చు. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కరోనా నిబంధనలు, లాక్ డౌన్ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపాయి. ఒడిశా హైకోర్టు సైతం వార్షిక ఫీజులో మినహాయింపు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వుల అమలు సరిగ్గా జరగని పక్షంలో తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే వెసులుబాటును హైకోర్టు కల్పించింది. అయితే ప్రభుత్వం ఈ వివాదం పెద్దది కాకూడదని భావించి 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా చర్యలు చేపడితే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు తరగతులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.