
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1.20 లక్షల మందికి కరోనా సోకగా 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. ఇప్పటి వరకు 3,44,082 మంది ప్రాణాలు కోల్పోగా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 5.73 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,97,894మంది కరోనా నుంచి కోలుకున్నారు.