Fail Cars: కారు అవసరం దాదాపుగా నేటి రోజుల్లో ఉంటుంది. చిన్న ఫ్యామిలీ అయినా సరే ఓ వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కార్ల కంపెనీలు వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు వివిధ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. కొన్ని మోడళ్లపై భారీ అంచానాలు పెట్టుకున్నా.. అవి సక్సెస్ కాలేకపోయాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. అలా భారీ అంచనాలతో వచ్చి విఫలమైన కార్లు ఏవో తెలుసుకుందాం..
దేశంలో మారుతి కంపెనీకి ప్రత్యేకత ఉంది. ఈ కంపెనీ నుంచి డిఫరెంట్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. మారుతి కంపెనీ నుంచి 2011 Kizashi కారు విడుదల అయింది. ఇది ప్రీమియం కారు కావడంతో దీనిపై పన్ను అధికంగా పడింది. దీంతో ఈ కారు ధరను రూ.16 లక్షలకుగా నిర్ణయించారు. ఇంత ధర పెట్టి కొనడానికి చాలా మంది ముందుకు రాలేదు. అంతేకాకుండా ఇందులో డీజిల్ ఇంజన్ లేకపోవడం మరో మైనస్ గా మారింది.
SUV కార్లను తీసుకురావడంలో టయోటా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ‘యారిష్’ అనే కారు మార్కెట్లోకి వచ్చింది. మంచి డిజైన్, ఫీచర్లను కలిగిన ఈ కారు మొదటి నుంచి సేల్స్ అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఇందులో కూడా డీజిల్ ఇంజిన్ లేకపోవడంతో ఈ కారు అమ్ముడుపోకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా నుంచి ఆక్టావియా కాంబి అనే కారును 2002లో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ కారులో బూట్ స్పేస్ ఎక్కువ ఉన్న ఈ కారు మంచి పనితీరు కనబరిచింది. కానీ వినియోగదారులు దీనిని ఆదరించలేకపోయారు. మినిమం సేల్స్ కూడా లేకపోవడంతో ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది.
ఇదే కంపెనీకి ఎల్టీ ఎస్ యూవీని పరిచయం చేసింది. ఈ కారుపై కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ఫార్చ్యునర్ కారు వలె దీనిని తీసుకువచ్చినా .. అందరూ ఫార్చ్చునుర్ వైపే మొగ్గు చూపడంతో ఎల్టీ సేల్స్ పెరగలేదు. దీంతో ఈ కారు మధ్యోలోనే ఆగిపోయింది.