CM Revanth Reddy: తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చినే నెల రోజులకే వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్‌కు హాజరయ్యారు. సుమారు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత అమెరికా, దక్షిణ కొరియా లాంటి దశాలకు వెళ్లారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. రాష్ట్రలోకి కొత్త పరిశ్రమలు రావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీని కూడా నెలకొల్పారు. ఇలా అనేక చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి మరో తెలివైన ఎత్తుగడ వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన ఫాక్స్‌కాన్ కంపెనీని మరింత విస్తరించే చర్యలు చేపట్టారు.
ఫాక్స్‌కాన్ కోసం పోటీ..
చైనాకు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ కోసం దేశంలోని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పరిశ్రమను స్థాపించింది. తాజాగా తమిళనాడులో ఏర్పాటుకు సుమఖత వ్యక్తం చేసింది. ఈతరుణంలో తెలంగాణ నుంచి పాక్స్‌కాన్ తరలిపోకూడదన్న ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కొంగర్ కలాన్‌లోని పాక్స్‌కాన్ సంస్థను రెండుసార్లు సందర్శించారు. తాజాగా మూడోసారి సోమవారం(అక్టోబర్ 14న) ప్లాంట్‌కు వెళ్లి.. అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాక్స్‌కాన్ సీఈవో, చైర్మన్ సిడ్నీ య్యూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీ విస్తరణకు కావాల్సిన సదుపాయాలు కల్పిసాతమని తెలిపారు. మరో 60 ఎకరాలు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
సిలికాన్ చిప్స్, లిథియం బ్యాటరీలు..
ఫాక్స్‌కాన్ ప్లాంటు విస్తరణ ద్వారా తెలంగాణలోనే సిలికాన్ చిప్స్, లిథియం బ్యాటరీలు తయారు చేయాలని సూచించారు. తగ్వారా స్థానికంగానే అనేక మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తరఫుస సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. తద్వారా పరిశ్రమ వెళ్లిపోకుండా ఉండడంతోపాటు పెట్టుబడులు పెరుగతాయన్నదే ఇక్కడ ప్రధాన అంశం.