నేటి కాలంలో ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉన్నాయి. కొందరికీ వేతనం పెరుగుతున్నా.. అంతే స్థాయిలో ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే చాలా మంది ఆర్థిక ప్రణాళిక లేకుండా ఆదాయ వ్యవహారాలు జరిపించడంతో ఫైనాన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దీంతో జీతం భారీగానే ఉన్నా.. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక ప్లాన్ ప్రకారంగా ఖర్చు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు జీవితం ఆనందంగా ఉంటుంది. ఇందు కోసం ఓ సూత్రం పాటించాలి. అదే 20:30:50. ఈ డిజిట్స్ ప్రకారంగా ఆదాయన్ని ఖర్చు చేస్తూ పొదుపు చేయగలిగితే ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోరు.
చాలా మందికి డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. అయితే కొందరికి అనుకోకుండా ఆదాయం వస్తుంది. తక్కువ జీతం ఉన్న వారి జీవితం.. ఎక్కువ ఆదాయం వచ్చే వారి జీవితం ఒక్కోసారి సమానంగా ఉంటుందని అనిపిస్తుంది. అందుకు కారణం వారికి వచ్చిన డబ్బును ప్లాన్ ప్రకారంగా ఖర్చు చేయడమే. తక్కువ ఆదాయం ఉన్నప్పుడు తక్కువ ఖర్చులు చేసిన వారు.. ఆదాయం పెరగగానే ఖర్చలు పెంచుతారు. కానీ పెట్టుబడులు పెంచాలన్న విషయాన్ని మరిచిపోతారు. అందువల్ల ఈ సూత్రాన్ని పాటించిన ఆదాయాన్ని కేటాయించాలి.
20,30,50 ప్రకారంగా వచ్చే ఆదాయాన్ని కేటాంచాలి. అంటే వచ్చిన ఆదాయంలో 20 శాతం వరకు పొదుపునకు కేటాయించాలి. ఇది బ్యాంకులో సేవింగ్ కావొచ్చు.. లేదా ఆదాయం వచ్చే పెట్టుబుడలు కావొచ్చు. 30 శాతం వరకు విచక్షణా ఖర్చులకు ఉపయోగించాలి. అంటే రెగ్యులర్ గా కాకుండా సీజనల్ వారీగా వచ్చే ఖర్చులకు ఉపయోగించాలి. ఉదాహరణకు జూన్ రాగానే పిల్లకు బుక్స్, బ్యాగ్ తదితర ఖర్చులు ఉంటాయి. వీటికి కేటాయించాలి. ఇక 50 శాతం అవసరాలకు ఉపయోగించుకోవాలి. అంటే ఇంటి అద్దె, సరుకులు, వెజిటేబుల్స్ ఇవి రెగ్యులర్ గా ఉంటాయి.
వీటిలో విచక్షణ ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే సరదాగా పెట్టే ఖర్చులను కూడా ఇందులోనే కేటాయించుకోవాలి. అప్పులు ఎక్కువగా ఉన్నవారు విచక్షణ ఖర్చుల్లో జాగ్రత్తలు పాటించాలి. అయితే 20 శాతం పెట్టుబుడులు మాత్రం తగ్గించొదు. ఒకవేళ జీతం పెరిగినా.. ఆదాయం పెరిగినా.. పెట్టుబడులు పెంచుకోవాలి.. అంతేగానీ ఖర్చులు పెంచుకోవద్దు.చాలా మంది పొదుపులను పెంచుతారు. కానీ అవసరాల కోసం అప్పులు చేస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే ఆదాయం కన్నా ఖర్చులే అధికరంగా ఉంటాయి. అందువల్ల పొదుపు విషయంలో అవసరాలకు మించిన తరువాతే ఆలోచించాలి.