https://oktelugu.com/

ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావొచ్చు..

చాలా సేపు ఎండలో పార్క్ చేసిన కారులో ఉన్న సీట్లు, డ్యాష్ బోర్డుల్లో కొన్ని విషపూరిత వాయువులు ఇమిడి ఉంటాయి. దీనినే బింజైమ్ లు అని అంటారు. ఇలా పార్క్ చేసిన కారులో 2000 నుంచి 4000 వరకు బింజైమ్ లు పెరుగుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2024 11:14 am
    Car Ac On In Summer

    Car Ac On In Summer

    Follow us on

    సమ్మర్ లో దూర ప్రయాణం చేసేవాళ్లు ఎక్కువగా కారు ప్రిఫరెన్స్ చేస్తారు. ఏసీ కారు అయితే ఎంత దూరమైనా చల్లగా వెళ్లొచ్చు. ఏసీ ఉన్న కారులో ప్రయాణం హాయిగా ఉంటుంది. కానీ ఈ కారు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవు. వేసవి కాలంలో ఏసీ కారును ఎండలో పార్క్ చేసిన తరువాత కొందరు కారులో ఎక్కుతూ వెంటనే ఏసీ ఆన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది క్యాన్సర్ కు దారి తీస్తుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలా ఏసీ ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    కొత్తగా మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లో కారు స్టార్ట్ చేసినప్పుడు ఏసీ ఆన్ అవుతుంది. కారు పార్క్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. పనులు ముగించుకొని వచ్చిన వారు కారులో ఎక్కుతూ వెంటనే ఏసీ ఆన్ చేస్తారు. ఇది సాధారణ సమయంలో పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వేసవి కాలంలో ప్రమాదరకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఎండలో ఉన్న కారు ఒక్కసారిగా ఏసీ ఆన్ చేయడం వల్ల ఏం జరగుతుందంటే?

    చాలా సేపు ఎండలో పార్క్ చేసిన కారులో ఉన్న సీట్లు, డ్యాష్ బోర్డుల్లో కొన్ని విషపూరిత వాయువులు ఇమిడి ఉంటాయి. దీనినే బింజైమ్ లు అని అంటారు. ఇలా పార్క్ చేసిన కారులో 2000 నుంచి 4000 వరకు బింజైమ్ లు పెరుగుతాయి. ఇవి మోతాదుకు మించి అంటే 40 రేట్లు ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి. ఇవి పెరిగి ఉన్న సమయంలో కారు వినియోగదారులు వెంటనే వచ్చి ఏసీ ఆన్ చేయడం వల్ల ఎయిర్ గాలిలో కలిసిపోతాయి. ఈ వాయువును ప్రయాణికులు పీల్చుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు.

    ఇలాంటి వాయువు పీల్చుకోవడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. కండరాల సమస్యలు ఎదుర్కొంటారు. కాలేయం తో పాటు గ్యాస్ సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇవి ఎక్కువగా పీల్చడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని అంటున్నారు. అయితే క్యాన్సర్ విషయంలో మాత్రం ఎక్కడా నిర్దారణ కాలేదు. కానీ బింజైమ్ లను పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేయకండి. అయితే ఎండలో కారు పార్క్ చేయాల్సి వస్తే కొంచెం వరకు విండో ఓపెన్ చేయండి. కారులోకి వచ్చిన సమయంలో కాసేపు ఫ్యాన్ ఎక్కువగా వేసి గాలి బయటకువెళ్లేలా చూడండి. ఆ తరువాత విండోస్ క్లోజ్ చేసి కూలింగ్ ఆన్ చేయండి.