దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కొత్త కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టల్ శాఖ ప్రజల ఆదాయం పెంచుకోవడానికి ఎన్నో రకాల స్కీమ్ లను అమలు చేస్తోంది. చేతిలో డబ్బులు ఉండి పోస్టల్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కచ్చితమైన రాబడిని పొందవచ్చు.
ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. 1,000 రూపాయలతో ఈ స్కీమ్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉండదు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 5వేల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కొరకు జాయింట్ అకౌంట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 59,400 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా 4.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 29,700 రూపాయలు లభిస్తాయి. 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నెలకు 5,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఐదు సంవత్సరాలు ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే చార్జీలు పడతాయి.
3 సంవత్సరాల లోపు విత్ డ్రా చేసుకునే వాళ్లు 2 శాతం, 3 సంవత్సరాల తర్వాత విత్ డ్రా చేసేవాళ్లు 1 శాతం ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. సామాన్యులు కూడా మంచి రాబడి పొందే స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.