Homeబిజినెస్EPFO Inactive Accounts Claim Process: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..

EPFO Inactive Accounts Claim Process: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..

EPFO Inactive Accounts Claim Process: ఉద్యోగులు ఆదాయాన్ని పొందే క్రమంలో Employees Provident Fund Organisation(EPFO) అనేది నేటి కాలంలో చాలా కీలకంగా మారింది. ప్రతి ఉద్యోగి తమకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తంలో ఈపీఎఫ్ ద్వారా జమ అవుతూ ఉంటుంది. ఈ మొత్తానికి కంపెనీలు కూడా అంతే మొత్తంలో జమ చేయడం వల్ల ఉద్యోగికి రిటైర్డ్ అయిన తర్వాత ఆర్థిక భరోసా ఉండనుంది. అయితే ఈపీఎఫ్ విషయంలో ఇప్పటికే చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా […]

EPFO Inactive Accounts Claim Process: ఉద్యోగులు ఆదాయాన్ని పొందే క్రమంలో Employees Provident Fund Organisation(EPFO) అనేది నేటి కాలంలో చాలా కీలకంగా మారింది. ప్రతి ఉద్యోగి తమకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తంలో ఈపీఎఫ్ ద్వారా జమ అవుతూ ఉంటుంది. ఈ మొత్తానికి కంపెనీలు కూడా అంతే మొత్తంలో జమ చేయడం వల్ల ఉద్యోగికి రిటైర్డ్ అయిన తర్వాత ఆర్థిక భరోసా ఉండనుంది. అయితే ఈపీఎఫ్ విషయంలో ఇప్పటికే చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సంస్థలు మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాల్లో డబ్బు నిల్వ ఉండిపోయింది. చాలామంది వీటిని క్లెయిమ్ తీసుకోలేదు. అయితే దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆ వివరాల్లోకి వెళ్తే..

EPFO లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 31.86 లక్షల ఇనాక్టివ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో 10,903 కోట్లు నిల్వగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తమ సంస్థలు మారినప్పుడు లేదా రిటైర్ అయిన తర్వాత చాలామంది పిఎఫ్ ఖాతాలను ట్రాన్స్ఫర్ చేయకపోవడం లేదా విత్ డ్రా చేసుకోకపోవడం వల్ల ఈ డబ్బు అలాగే ఉండిపోయింది. అయితే దీనిని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి పీఎఫ్ ఖాతాల్లో ఉండిపోయిన డబ్బులు తీసుకునేందుకు మార్గం చూపింది. ఇందులో భాగంగా ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా చిన్న మొత్తల పొదుపు ఖాతాలను లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1000 లోపు ఉన్న ఖాతాల వారు దరఖాస్తు చేసుకుంటే ఈ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ రకమైన వారు సుమారు 7 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత పెద్ద మొత్తంలో ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకొని ఎందుకు అవకాశం ఇస్తారు. అయితే ఇలా ఖాతాల్లో ఉండిపోయిన డబ్బులు తీసుకునేందుకు ముందుగా ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్, బ్యాంకు ఖాతాకు లింక్ చేసి తప్పనిసరిగా ఉండాలని అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు వివరాల ఆధారంగా ఈ నగదును ఖాతాల్లో జమ చేస్తూ ఉంటారు. ఈపీఎఫ్ఓ నిబంధన ప్రకారం మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా లావాదేవీలు లేకపోతే పిఎఫ్ ఖాతాను ఇనాక్టివ్గా పరిగణిస్తారు. అలాగే ఉద్యోగం మానేసి లేదా ఇతర సంస్థలోకి మారినప్పుడు విత్ డ్రా చేసుకోకపోతే కూడా ఇనాక్టివ్ కిందనే పరిగణిస్తారు. అందువల్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ యుఏఎన్ నెంబర్తో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆధార్, పాన్ వివరాలను కూడా అప్డేట్ చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper