Emergency Car Features
Emergency Car Features : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఏప్రిల్ 22న భారతీయ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో ఈ ఘర్షణ మొదలైంది. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులే కారణమంటూ భారత్ ఆరోపించింది. మే 7న “ఆపరేషన్ సింధూర్” పేరుతో పాకిస్తాన్ భూభాగంలో పలు లక్ష్యాలపై క్షిపణి, వైమానిక దాడులు చేసింది.
Also Read : బడ్జెట్ తక్కువైనా.. బెస్ట్ ఫీచర్స్ ఉండే కార్లు ఇవే..
కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఉల్లంఘన ఆరోపణలు చేసుకున్నాయి. కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. డ్రోన్ దాడుల భయంతో వైమానిక భద్రతను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఇంకా ఉద్రికత్తంగానే ఉంది. కాబట్టి, దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితికి అయినా సిద్ధంగా ఉండాలి. దీని కోసం ప్రభుత్వం బ్లాక్‌అవుట్, సైరన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చాలా ఉపయోగపడే కారులో ఉండే ఒక ఫీచర్ గురించి తెలుసకుందాం.
యుద్ధ సమయంలో కారు రేడియో, FM ఫీచర్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కారులో ఉన్నప్పుడు టీవీ లేదా మొబైల్ ఉపయోగించకుండా ఉండవచ్చు. కాబట్టి వెంటనే సమాచారం అందుబాటులోకి రాదు. రేడియో, FM ద్వారా దాడి సమయంలో ప్రభుత్వ హెచ్చరికలు, వాతావరణ సమాచారం, భద్రతా సూచనలు వినవచ్చు. ఇది సంక్షోభ పరిస్థితుల్లో చాలా అవసరం.
యుద్ధ సమయంలో, ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో ద్వారా ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారాన్ని ప్రసారం చేస్తాయి. భద్రతా సూచనలు, తరలింపు ఆదేశాలు లేదా ప్రమాదకర ప్రాంతాల సమాచారం వంటివి తెలుసుకోవచ్చు. యుద్ధ పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాల గురించి సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం, ఏజెన్సీలు రేడియో ద్వారా ఆశ్రయం పొందడానికి సురక్షితమైన స్థలాలు, అత్యవసర సేవలను సంప్రదించే మార్గాల గురించి సమాచారం ఇవ్వగలవు.
Also Read : కొత్త రికార్డు సృష్టించిన ‘కియా’..
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Emergency car features saving lives during war