TDP
TDP : ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది ఆ కుటుంబం. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చినా.. తమకు ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. అయితే రాష్ట్ర విభజనతో అనూహ్యకర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళింది ఆ కుటుంబం. పార్టీ అధినేత చంద్రబాబు మంచి అవకాశాలు ఇచ్చారు. కానీ ఆ కుటుంబం రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు శాపం గా మారాయి. ప్రస్తుతం పవర్ పాలిటిక్స్ కు ఆ కుటుంబం దూరంగా ఉంది. కానీ నాయకత్వం ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తోంది. మూడోసారి పోటీ చేసి ఉంటే ఆ కుటుంబానికి చెందిన జయదేవ్ గెలిచేవారు. కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టేవారు. కానీ అనూహ్యకర పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
Also Read : వైసిపి అడ్డాలో ‘మహానాడు’.. ఈసారి ప్రత్యేకత అదే!
* తొలిసారిగా రాజకీయాల్లోకి..
గల్లా కుటుంబం నుంచి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు అరుణకుమారి( Aruna Kumari ). ఈమె గల్లా రామచంద్ర రావు భార్య. పారిశ్రామికవేత్తగా రామచంద్రరావు ఉండడంతో ఆయన భార్య అరుణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1989లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజనతో గల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసింది.
* కుమారుడు గెలుపు, తల్లి ఓటమి
2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం( Chandragiri ) నుంచి పోటీ చేశారు గల్లా అరుణకుమారి. అదే సమయంలో అరుణకుమారి కుమారుడు జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అరుణ కుమారికి ఓటమి ఎదురైంది. గుంటూరు నుంచి మాత్రం జయదేవ్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. నాడు గల్లా అరుణకుమారి గెలిచి ఉంటే క్యాబినెట్ మంత్రి అయి ఉండేవారు. అయితే 2014 నుంచి 2019 మధ్య ఎంపీగా లోక్ సభలో తన వాయిస్ బలంగా వినిపించారు గల్లా జయదేవ్. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు జయదేవ్. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండోసారి గెలిచి సత్తా చాటారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పారిశ్రామికవేత్తగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నిర్ణయానికి వచ్చారు. అయినా సరే తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరిస్తూ వచ్చారు. గల్లా జయదేవ్ స్థానంలో టిడిపి టికెట్ పొందిన మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. క్యాబినెట్ సహాయం మంత్రి పదవి పొందారు. అయితే గల్లా జయదేవ్ పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా హ్యాట్రిక్ ఎంపీ అయి ఉండేవారు. ఆయనకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కేది. అయితే దురదృష్టవశాత్తు జయదేవ్ అనే నిర్ణయం తీసుకున్నారు.
Also Read : నాలుగు దశాబ్దాల తరువాత.. టిడిపి చేతికి గ్రేటర్ విశాఖ!
* పెద్దల సభకు..
అయితే జయదేవ్ ( Jaidev )సేవలను మరోలా వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టు ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే గల్లా జయదేవ్ కు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు కేంద్ర పెద్దలతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే పెద్దల సభకు పంపించి ఆయనకు గౌరవిస్తారని టాక్ నడుస్తోంది. లేకుంటే క్యాబినెట్ తో సమానమైన ర్యాంకుతో కూడిన పదవి మరికొద్ది రోజుల్లో దక్కనుందని అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Tdp former mp soon in house of elders