Maruti Suzuki EV Cars: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ తమ అవసరాల నిమిత్తం కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అటు సామాన్యులు కూడా అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో కారును తీసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారి కోసం మారుతి సుజుకి సంస్థ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురానుంది. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి సుజుకి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించనుంది. ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ లో విప్లవాత్మక మార్పులకు రెడీ అవుతున్న మారుతి సుజుకి ఈ కార్లను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ కార్లు ఈవీ రంగంలో ట్రెండ్ ను సృష్టిస్తాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
ముందుగా మారుతి సుజుకి eVX SUV:
ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి రానుంది. 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన ఈవీఎక్స్ కాన్సెప్ట్ కారు మిడ్ రేంజ్ ఎస్యూవీ. దీని కోడ్ నేమ్ వైవై8. అంతేకాదు ఇది హ్యుందాయ్ కెట్రా ఈవీ మరియు టాటా Curvv EV కార్లతో పోటీ పడుతుంది.
మారుతి సుజుకి, టయోటా సంయుక్తంలో వచ్చిన బర్న్ – ఎలక్ట్రిక్ ప్లాట్ ఫారమ్ eVX.. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లో అందుబాటులో ఉండనుంది. 48 kWh మరియు 60 kWh బ్యాటరీ ప్యాక్‌లలో రానుండగా.. ఈ కారుని ఫుల్ ఛార్జ్ చేస్తే 550 కి.మీల వరకు రేంజ్‌ను అందించనుంది.
eVX తరువాత మారుతి సుజుకి మరో ఎంపీవీ రానుండగా దీని కోడ్ నేమ్ వైఎంసీ. ఇది 2026 సెప్టెంబరులో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ MPV eVX ని పోలి ఉండనుంది. అలాగే 3- వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీ రైడింగ్ లో సీమ్ లెస్ అనుభవాన్ని కల్గిస్తుంది.
అయితే అందుబాటు ధరల్లో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో మారుతి వీటిని మార్కెట్ లోకి తీసుకువస్తుంది. మారుతి సుజుకి బెస్పోక్ K-EV ప్లాట్ ఫారమ్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ గా ఈ కారు మార్కెట్ లోకి ప్రవేశిస్తోందని చెప్పుకోవచ్చు. eWX కాన్సెప్ట్ హ్యాచ్ బ్యాక్ 2026-27 లో వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.